Google Pixel 9 Pro : ఈ ఏడాది ద్వితీయార్ధంలో పిక్సెల్ ఫ్లాగ్షిప్ ఫోన్లను లాంఛ్ చేసేందుకు గూగుల్ సన్నద్ధమవుతోంది. గూగుల్ పిక్సెల్ 9, పిక్సెల్ 9 ప్రొ ఫోన్లను అప్‌కమింగ్ ఈవెంట్లో స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఆవిష్కరించనుందని భావిస్తున్నారు. కీలక అప్‌గ్రేడ్స్‌తో ఈ స్మార్ట్ఫోన్లపై అప్పుడే పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది.
ప్రీమియం గూగుల్ పిక్సెల్ 9 ప్రొ డిజైన్, డైమెన్షన్స్‌ను 360 డిగ్రీ వీడియోలో ఆవిష్కరించే 5కే రెండర్స్‌ను ఆన్‌లీక్స్ సహకారంతో మైస్మార్ట్‌ప్రైస్ రిలీజ్ చేసింది. గెలాక్సీ ఎస్24 ప్లస్, ఐఫోన్లను పోలిన తరహాలో పిక్సెల్ 9 ప్రొ డిజైన్ ఆకట్టుకునేలా ఉందని లీక్స్‌లో వెల్లడైంది. గూగుల్ పిక్సెల్ 9 ప్రొ ఐఫోన్ తరహాలో ఫ్లాట్ ఎడ్జ్‌లు, రౌండెడ్ కెమెరా బార్‌ను కలిగిఉంది. ఈ డివైజ్ 6.5 ఇంచ్ ఫ్లాట్ డిస్ప్లేతో పాటు సెల్ఫీ కెమెరా కోసం పంచ్-హోల్ కటౌట్‌తో ఆకట్టుకోనుంది.
కుడివైపున పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్‌తో పాటు ఫ్లాగ్షిప్ డివైజ్ ఫ్లాట్ ప్రేమ్‌ను కలిగిఉందని ఆన్‌లీక్స్ లీక్స్‌లో వెల్లడైంది. డివైజ్ కింది భాగంలో యూఎస్బీ టైప్-సీ పోర్ట్, స్పీకర్ గ్రిల్, సిమ్ కార్డ్ ట్రే ఉండగా, టాప్‌లో ఎంఎంవేవ్ యాంటెన్నా, మైక్రోఫోన్ కనిపించాయి. ఇక వేరియబుల్ అపెర్చర్కు సపోర్ట్ చేస్తూ పిక్సెల్ 9 ప్రొ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో రానుంది.
Read More :