eBay Layoffs | ఈకామర్స్ దిగ్గజం కొలువుల కోత : 1000 మందిపై ఈబే వేటు
eBay Layoffs | ఈకామర్స్ దిగ్గజం కొలువుల కోత : 1000 మందిపై ఈబే వేటు
eBay Layoffs : ఈ ఏడాది ఆరంభంలోనే గూగుల్, అమెజాన్, మెటా సహా పలు టెక్ దిగ్గజాలు కొలువుల కోతకు తెగబడగా లేటెస్ట్గా ఈ-కామర్స్ దిగ్గజం ఈబే 1000 మంది ఉద్యోగులపై వేటు వేయనుంది. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఏకంగా ఉద్యోగుల్లో 9 శాతం మందిని సాగనంపాలని నిర్ణయించింది. గత త్రైమాసంలో భారీ లాభాలను ఆర్జించిన ఈబే ఉద్యోగుల తొలగింపునకు పాల్పడటం హాట్ టాపిక్‌గా మారింది.
కంపెనీలో పనిచేసే మొత్తం ఉద్యోగులు, ఖర్చులు తమ వ్యాపార వృద్ధి కంటే అధికంగా ఉన్నాయని, దీంతో ప్రపచంవ్యాప్తంగా కస్టమర్లకు మెరుగైన సేవలు అందించే క్రమంలో సంస్ధాగత మార్పులు చేపట్టామని ఉద్యోగులకు పంపిన లేఖలో ఈబే సీఈవో జేమీ లనోన్ పేర్కొన్నారు.
కరోనా మహమ్మారి అనంతరం పలు కంపెనీలు ఓవర్హైరింగ్కు దిగడంతోనే ప్రస్తుతం టెక్ పరిశ్రమ ఉద్యోగుల సంఖ్యను కుదించే క్రమంలో లేఆఫ్స్‌కు తెగబడుతున్నాయి. దీంతో 2022 సంవత్సారంతో పలు కంపెనీలు పునర్వ్యవస్ధీకరణ చర్యల్లో భాగంగా ఖర్చులు తగ్గించుకునే పనిలో ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి.
Read More :
Glenn Maxwell: ఫుల్‌గా తాగి స్పృహ కోల్పోయిన మ్యాక్స్‌వెల్
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

