Google Flights | విమాన ప్రయాణికుల కోసం గూగుల్ కొత్త ఫీచర్లు.. అవేమిటంటే..?!
Google Flights | విమాన ప్రయాణం చేసే వారు టికెట్ ధరలు ఎప్పుడు తగ్గుతాయో తెలుసుకునేందుకు గూగుల్ కొత్త ఫీచర్ ‘గూగుల్ ఫ్లైట్స్’ తీసుకొచ్చింది. దీని సాయంతో విమాన ప్రయాణికులు మనీ ఆదా చేయొచ్చునని గూగుల్ పేర్కొంది.
Google Flights | కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లు.. సీనియర్ ప్రభుత్వాధికారులు.. వ్యాపారులు.. నిత్యం విమాన టికెట్లు కొనుగోలు చేస్తుంటారు. ఇప్పుడు ప్రతిదీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో ఏమాత్రం పొదుపు చేసుకున్నా బెటరే కదా.. విమాన టికెట్ల ధరలు రకరకాలుగా ఉంటాయి. ప్రయాణ సమయాన్ని బట్టి టికెట్ ధరలు పెరుగుతూ ఉండొచ్చు.. ఒక్కోసారి తగ్గుతూ ఉంటాయి. ఈ పరిస్థితుల్లో విమాన ప్రయాణం చేసేవారు టికెట్ల కొనుగోలులో డబ్బు పొదుపు చేయాలని భావించే వారి కోసం సెర్చింజన్ ‘గూగుల్ (Google)’ కొత్తగా గూగుల్ ఫ్లైట్స్ (Google Flights) ఫీచర్ తీసుకొచ్చింది.
గతంతో పోలిస్తే టిక్కెట్ ధర ఎక్కువా.. తక్కువా అని నిర్ధారించుకునే ఆప్షన్ ఇప్పటికే గూగుల్ ఫ్లైట్స్‌లో ఉన్నా.. తక్షణం టికెట్ బుక్ చేసుకోవడమా.. మున్ముందు తగ్గుతుందా.. అనే సంగతి తేల్చుకోవడం మాత్రం కష్టమే.. కానీ కొత్తగా తెచ్చిన ఫీచర్ ప్రకారం గత టికెట్ ధరల హిస్టరీ ఆధారంగా ఎప్పుడు టికెట్ ధరలు తగ్గుతాయో గూగుల్ ఫ్లైట్స్ ఫీచర్ చెబుతుంది. గత ట్రెండ్ ఆధారంగా అనునిత్యం సమాచారం అందిస్తూ ఉంటుంది. తద్వారా ప్రయాణికులు టికెట్ ఎప్పుడు బుక్ చేసుకుంటే బెటర్ అనే అంశంపై ఒక నిర్ణయానికి రావచ్చునని గూగుల్ తన బ్లాగ్ లో రాసుకొచ్చింది. గత ట్రెండ్స్ ప్రకారం విమాన సర్వీస్ బయలుదేరడానికి 22 రోజుల ముందూ సగటున టికెట్ ధరలు తక్కువగా ఉంటాయని తెలుస్తున్నది.
ఇప్పటికే అందుబాటులో ఉన్న గూగుల్ ఫ్లైట్స్‌లో త్వరలో ‘ప్రైస్ ట్రాకింగ్’ అనే ఫీచర్ తెస్తోంది. ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుంటే చాలు.. టిక్కెట్ ధర తగ్గగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ధరలు దిగినప్పుడు నోటిఫికేషన్ వచ్చేలా సెట్ చేసుకుంటే సరి.. అందుకోసం మీరు తప్పనిసరిగా గూగుల్ అకౌంట్ లో లాగిన్ అయి ఉండాలి.
కొన్ని విమాన సర్వీసుల ప్రయాణాలపై ఓ రంగుతో కూడిన బ్యాడ్జ్ ఉంటే గత ట్రెండ్ ప్రకారం టికెట్ ధర అంతకంటే తగ్గే అవకాశం లేదని అర్థం. ఒకవేళ అంతకంటే తగ్గితే మీరు టికెట్ ధరపై చెల్లించిన అదనపు మొత్తం గూగుల్ మీ ఖాతాలో డిపాజిట్ చేస్తుంది. అయితే ఈ ప్రాజెక్టు కొన్ని రూట్లలో పైలట్ ప్రాతిపదికన అమలు చేస్తున్నామని గూగుల్ వెల్లడించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం’
Jio IPO | జియో ప్లాట్‌ఫామ్స్ మెగా ఐపీవో.. నిమిషాల్లోనే పూర్తి సబ్‌స్క్రైబ్.. 3 రెట్లు బుక్ అయిన క్యూఐబీ
Supreme Court | మున్సిపల్ ఎన్నికలపై ఏపీ ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు
Donga Naa Koduku | ‘దొంగ నా కొడుకు’ టీజర్ విడుదల.. ఆకట్టుకుంటున్న మౌళి కామెడీ ఎంటర్టైనర్!
Paddy Crops | మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఇలాకాలో పంటల పరిస్థితి చూడండి.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

