Mass Layoffs | 2024లోనూ లేఆఫ్స్ గుబులు..ఏడాది ఆరంభంలోనే కొలువుల కోత
Mass Layoffs : 2023లో టెక్ దిగ్గజాలతో పాటు స్టార్టప్‌లు సైతం ఎడాపెడా మాస్ లేఆఫ్స్‌కు తెగబడగా కొత్త ఏడాది సైతం టెకీలపై లేఆఫ్స్ కత్తి వేలాడుతోంది.
Mass Layoffs : 2023లో టెక్ దిగ్గజాలతో పాటు స్టార్టప్‌లు సైతం ఎడాపెడా మాస్ లేఆఫ్స్‌కు తెగబడగా కొత్త ఏడాది సైతం టెకీలపై లేఆఫ్స్ కత్తి వేలాడుతోంది. 2024లో అడుగుపెట్టామో లేదో తొలి మాసంలోనే గూగుల్, అమెజాన్, మెటా సహా పలు దిగ్గజ కంపెనీలు కొలువుల కోతకు తెగబడ్డాయి. ఈ ఏడాదీ లేఆఫ్స్ తప్పవనే విస్పష్ట సంకేతాలు పంపాయి.
కంపెనీ పునర్వ్యవస్ధీకరణ, వ్యయ నియంత్రణ చర్యలు, ఆర్ధిక మందగమనం పేరుతో వందలాది ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తున్నాయి. జనవరి ప్రధమార్ధంలోనే పలు విభాగాల్లో ఆయా కంపెనీలు పెద్దసంఖ్యలో ఉద్యోగులపై వేటు వేయడం ఆందోళన రేకెత్తిస్తోంది. రాబోయే రోజుల్లో మాస్ లేఆఫ్స్‌కు ఈ ట్రెండ్ సంకేతమని టెకీల్లో గుబులు రేగుతోంది. ఇక ఈ ఏడాది జనవరిలోనే కొలువుల కోతకు తెగబడిన కంపెనీల విషయానికి వస్తే..
గూగుల్
సెర్చింజన్ దిగ్గజం గూగుల్ 2024 ఆరంభంలోనే పలువురు ఉద్యోగులపై వేటు వేసింది. హార్డ్‌వేర్, ఇంజనీరింగ్, డిజిటల్ అసిస్టెంట్, అడ్వర్టైజింగ్ సహా పలు విభాగాల్లో 1000 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. గూగుల్‌లో మరిన్ని లేఆఫ్స్ తప్పవని కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ ఉద్యోగులకు పంపిన మెమోలో స్పష్టం చేశారు.
యూట్యూబ్
గూగుల్ లేఆఫ్స్ నేపధ్యంలో యూట్యూబ్ సైతం తమ ఆపరేషన్స్‌తో పాటు క్రియేటర్ మేనేజ్మెంట్ టీమ్స్ నుంచి 100 మంది ఉద్యోగులను తొలగించింది. అల్ఫాబెట్ గ్రూప్ పునర్వ్యవస్ధీకరణలో భాగంగా కొలువుల కోత చేపట్టినట్టు కంపెనీ వెల్లడించింది.
అమెజాన్
టెక్ దిగ్గజం అమెజాన్ సైతం ఫ్రెష్ లేఆఫ్స్ ప్రకటించింది. ప్రైమ్ వీడియో, ఎంజీఎం స్టూడియో డివిజన్స్‌లో ఉద్యోగులను తొలగించనున్నట్టు వెల్లడించింది. తన కీలక ప్రాధాన్యతలపై దృష్టి సారించడంతో పాటు ఆపరేషన్స్ క్రమబద్ధీకరణలో భాగంగా ఉద్యోగుల సంఖ్యను కుదించినట్టు పేర్కొంది.
మెటా
ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రాం మాతృసంస్ధ మెటా ఈ ఏడాది ఆరంభంలోనే లేఆఫ్స్ ప్రకటించింది. టెక్నికల్ ప్రోగ్రాం మేనేజర్ విభాగంలో 60 మంది ఉద్యోగులపై మెటా వేటు వేసింది. కంపెనీ పునర్వ్యవస్ధీకరణ ప్రణాళికలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.
డిస్కార్డ్
ఆన్లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం డిస్కార్డ్ ఏడాది ఆరంభంలో లేఆఫ్స్‌కు తెగబడింది. కంపెనీ ఉద్యోగుల్లో 17 శాతం మంది ఉద్యోగులు 170 మందిని తొలగిస్తున్నామని డిస్కార్డ్ ప్రకటించింది. కంపెనీ కార్యకలాపాలను క్రమబద్ధీకరించే క్రమంలో సంక్లిష్ట నిర్ణయం తీసుకున్నామని డిస్కార్డ్ సీఈవో జాసన్ సిట్రన్ చెప్పారు.
ట్విచ్
ఇక టెక్ దిగ్గజం అమెజాన్ కొనుగోలు చేసిన స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం ట్విచ్ లేఆఫ్స్ ప్రకటించింది. ఉద్యోగుల్లో 35 శాతం మందిని తప్పించనున్నట్టు వెల్లడించింది.
Read More :
Amazon | గూగుల్ బాటలో అమెజాన్.. ప్రైమ్ డివిజన్లో 5 శాతం ఉద్యోగులపై వేటు
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

