Gold Silver price : కొన్ని రోజులుగా శరవేగంగా దూసుకెళ్లిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు దిగి వస్తున్నాయి. కేంద్ర బడ్జెట్వేళ దేశీయ కమొడిటీ మార్కెట్లో ఈ రెండు లోహాల ధరలు 9 శాతం మేర క్షీణించాయి. ఇప్పటికే రికార్డు గరిష్ఠాలకు చేరుకున్న బంగారం, వెండి ధరలు.. లాభాల స్వీకరణ కొనసాగుతుండటంతో ఆదివారం దిగివచ్చాయి.
మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజీలో ఫ్యూచర్స్ ట్రేడింగ్లో ఏప్రిల్ కాంట్రాక్ట్ బంగారం ధర ఆదివారం 9 శాతం పతనం అయ్యింది. 10 గ్రాముల బంగారం ధర ఒక్కరోజులోనే రూ.13,711 క్షీణించి రూ.1,38,634కు చేరింది. అంతకుముందు గురువారం ఒక్కరోజే పసిడి ధర రూ.31,617 (17.2 శాతం) మేర పతనమైంది. దాంతో రూ.1,93,096 నుంచి ఒక్కసారిగా రూ.1,52,345కు చేరింది.
వెండి ధరల్లోనూ పతనం కొనసాగుతున్నది. రికార్డు గరిష్ఠాల వద్ద ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగుతుండటంతో మార్చి కాంట్రాక్ట్ వెండి ధర ఒక్క రోజులోనే రూ.26,273 (9 శాతం) పతనమై రూ.2,65,652కి చేరింది. శుక్రవారం ఒక్కరోజే వెండి కిలో ధర రూ.1,07,968 క్షీణించి రూ.2,91,925కి చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితులు, బడ్జెట్వేళ మదుపర్ల అప్రమత్తత కారణంగా బంగారం, వెండి ధరలు పతనమవుతున్నాయని అనలిస్టులు చెబుతున్నారు. కాగా ఇవాళ ఆదివారం కావడంతో ప్రపంచ ఫ్యూచర్ మార్కెట్లు ఇవాళ పనిచేయడం లేదు.