Gold-Silver Price | కొనుగోలుదారులకు బిగ్ రిలీఫ్.. భారీగా తగ్గిన పసిడి, వెండి ధరలు..!
Gold-Silver Price | ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం వార్తల మధ్య ప్రపంచ మార్కెట్లో బంగారం, వెండి డిమాండ్ తగ్గింది. ఫలితంగా ధరలు భారీగా పతనమయ్యాయి. మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.900 తగ్గింది.
Gold-Silver Price | ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం వార్తల మధ్య ప్రపంచ మార్కెట్లో బంగారం, వెండి డిమాండ్ తగ్గింది. ఫలితంగా ధరలు భారీగా పతనమయ్యాయి. మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.900 తగ్గింది. ప్రస్తుతం తులం ధర రూ.98,900కి చేరుకుంది. మరోవైపు 22 క్యారెట్ల పసిడి ధర రూ.800 తగ్గడంతో తులానికి రూ.98,300కి పతనమైంది. మరో వైపు వెండి ధర సైతం భారీగా దిగివచ్చింది. రూ.1000 తగ్గి కిలోకు రూ.1,04,200 పలుకుతుందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ పేర్కొంది. ఇదిలా ఉండగా.. విదేశీ మార్కెట్లో స్పాట్ గోల్డ్ 46.05 తగ్గి ఔన్సుకు 3,323.05 డాలర్లకు చేరుకుంది.
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య పూర్తి కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో పసిడి పెట్టుబడులకు డిమాండ్ తగ్గడంతో బంగారం ఒత్తిడికి గురైందని అబాన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చింతన్ మెహతా అన్నారు. ఉద్రిక్తతల భయం తగ్గడంతో పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు దిగుతున్నారని పేర్కొన్నారు. మంగళవారం-బుధవారం మధ్య యూఎస్ కాంగ్రెస్లో ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ప్రసంగంపై పెట్టుబడిదారులు దృష్టి సారించారని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ అనలిస్ట్ (కమోడిటీస్) సౌమిల్ గాంధీ వెల్లడించారు. వడ్డీ రేట్ల తగ్గింపుకు సంబంధించి భవిష్యత్తు విధానంపై సూచనలు ఇచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. 22 క్యారెట్ల పసిడి ధర రూ.90,950 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి ధర రూ.99,220 పలుకుతున్నది. ఇక వెండి కిలో ధర రూ.1.19లక్షలుగా ఉన్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

