పడిలేస్తున్న పసిడి ధరలు

న్యూఢిల్లీ: దేశంలో గత రెండు నెలలుగా వేగంగా పడిపోయిన పసిడి ధరలు క్రమంగా పుంజుకుంటున్నాయి. వారంలో క్రితం రూ.43 వేల దిగువకు చేరిన తులం పసిడి ధర.. గత నాలుగు రోజులుగా కొద్దికొద్దిగా పెరుగుతూ రూ.44,500 మార్కును దాటింది. ఢిల్లీలో ఇవాళ 99.9 స్వచ్చత కలిగిన 10 గ్రాముల బంగారం ధర రూ.60 పెరిగి రూ.44,519కి చేరింది. క్రితం ట్రేడ్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.44,459 వద్ద ముగిసింది. ఇదిలావుంటే వెండి ధర ఇవాళ స్వల్పంగా తగ్గింది. కిలో వెండి ధర రూ.200 తగ్గి రూ.66,536కు చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.66,736 వద్ద ముగిసింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లలో ఇవాళ ఔన్స్ బంగారం ధర 1,735 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 26 అమెరికన్ డాలర్లు పలికింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

