Gold Rate | దేశ రాజధానిలో సోమవారం 24 క్యారట్ల బంగారం తులం రూ.60,050 వద్ద నిలకడగా కొనసాగిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తెలిపింది. కానీ, కిలో వెండి ధర రూ.450 తగ్గి రూ.75,350 వద్ద స్థిర పడింది. మరోవైపు, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పతనం అయ్యాయి. ఔన్స్ బంగారం ధర 1922 డాలర్లు, ఔన్స్ వెండి 23.45 డాలర్లు పలికింది. ఇటీవల వెలువడిన యూఎస్ మైక్రో డేటాతోపాటు ఫెడ్ రిజర్వు వ్యాఖ్యలతో డాలర్ ఇండెక్స్ బలోపేతం అయింది. అమెరికా ఫెడ్ రిజర్వు వ్యాఖ్యల ప్రభావం బంగారం ధరలపై పడిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమొడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు.
మరోవైపు ఫ్యూచర్స్ మార్కెట్లో బంగారం ధర సోమవారం రూ.14 తగ్గి రూ.58,932 వద్ద స్థిర పడింది. మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో అక్టోబర్ డెలివరీ తులం బంగారం ధర రూ.14 తగ్గి రూ.58,932 వద్దకు చేరుకున్నది. ఇన్వెస్టర్ల నుంచి అనాసక్తి నేపథ్యంలో బంగారం ధరలు పడిపోయాయని అనలిస్టులు చెబుతున్నారు. న్యూయార్క్ ఫ్యూచర్స్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 0.10 శాతం తగ్గి 1943.70 డాలర్లు పలికింది.