బంగారం భగభగ
బంగారం ధర భారీగా పుంజుకున్నది. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన పుత్తడి రేటు బుధవారం ఏకంగా రూ.5 వేల వరకు పెరిగింది. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర ఏకంగా రూ.4,800 ఎగబాకి రూ.1,46,600కి చేరుకున్నది.
- రూ.4,800 పెరిగిన తులం ధర
- రూ.1.46 లక్షలకు చేరుకున్న విలువ
న్యూఢిల్లీ, నవంబర్ 4: బంగారం ధర భారీగా పుంజుకున్నది. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన పుత్తడి రేటు బుధవారం ఏకంగా రూ.5 వేల వరకు పెరిగింది. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర ఏకంగా రూ.4,800 ఎగబాకి రూ.1,46,600కి చేరుకున్నది. పండుగ సీజన్, గ్లోబల్ మార్కెట్లో ధరలు పుంజుకోవడం, ధంతేరస్ తోడవడం కూడా ధరలు ఎగబాకడానికి ప్రధాన కారణం.
వెండిది అదే బాట
బంగారంతోపాటు వెండి ధరలు భారీగా పుంజుకున్నాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో కిలో వెండి ఏకంగా రూ.9 వేలు అధికమై రూ.1.93 లక్షలకు చేరుకున్నది. మంగళవారం ఇది రూ.1.84 లక్షలుగా ఉన్నది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఊపందుకోవడంతోపాటు దేశీయంగా పండుగ సీజన్, ధంతేరస్ కూడా కావడంతో కొనుగోళ్లు పుంజుకున్నాయని, తద్వారా ధరలు ఎగబాకాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు.
అక్టోబర్ నెలలో 8 శాతం కరెక్షన్కు గురైన ధరలు ప్రస్తుత నెలలో పుంజుకోవడం విశేషమన్నారు. డాలర్ బలోపేతం కావడం, బాండ్ల రాబడులు ఎక్కువగా ఉండటం, ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్ల తగ్గింపుపై ఆశలు సన్నగిల్లడంతో వ్యాపారులు లాభాల స్వీకరణకు దిగడంతో ఇటీవల ధరలు తగ్గుముఖం పట్టాయని చెప్పారు. గత ధంతేరస్తో పోలిస్తే గోల్డ్ ధరలు 65 శాతం వరకు ఎగబాకాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ 113.72 డాలర్లు లేదా 3 శాతం ఎగబాకి 4,043.93 డాలర్లకు చేరుకోగా, వెండి 4.5 శాతం అందుకొని 52 డాలర్లు పలికింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

