బంగారం మళ్లీ ఆల్టైమ్ హై?.. వచ్చే రెండేండ్లలో చేరవచ్చన్న అంచనాలు
బంగారం ధరలు వచ్చే రెండేండ్లలో ఆల్టైమ్ హై రికార్డు స్థాయికి చేరవచ్చని అటు మదుపర్లు, ఇటు ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
న్యూఢిల్లీ, అక్టోబర్ 17 : సెంట్రల్ బ్యాంకులు తమ పసిడి కొనుగోళ్లను పెంచడం, ప్రభుత్వ అప్పుల భారంపై ఆందోళనలు, భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, కరెన్సీ మార్కెట్లో డాలర్కు ఆటుపోట్లు.. పుత్తడికి మళ్లీ పుర్వ వైభవాన్ని తీసుకొస్తాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మరి. నిజానికి ఇప్పుడు మార్కెట్లో గోల్డ్ రేట్లు పతనం దిశగా వెళ్తున్నాయి.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ రాబోయే ద్రవ్య సమీక్షల్లో వడ్డీరేట్లను పెంచుతుందన్న అంచనాల మధ్య ఈ వారంలో ఒక్కరోజే పసిడి రేటు 2 శాతం దిగజారి ఔన్సు 4,075 డాలర్లకు క్షీణించింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు విజృంభిస్తుండటంతో ద్రవ్యోల్బణం భయాలు వెంటాడుతున్నాయి. దీంతో ఫెడ్ వడ్డీరేట్లు పెరిగితే డాలర్లకు డిమాండ్ పెరుగడం, బాండ్లపై రాబడులు ఆకర్షణీయంగా మారడం జరిగిపోతాయి. ఫలితంగా మదుపర్లు తమ పెట్టుబడులను సహజంగానే గోల్డ్ నుంచి ఉపసంహరించుకుంటారు.
ఇదే.. పుత్తడి ధరల క్షీణతకు దారితీస్తున్నది. అయితే మార్కెట్లో తీవ్ర ఒడిదుడుకుల కారణంగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల రక్షణార్థం బంగారం వైపునకే చూస్తారని, అందుకే రేట్లు తిరిగి దూసుకుపోవడం ఖాయమన్న అభిప్రాయాలను ఫండ్ మేనేజర్లు వెలిబుచ్చుతున్నారు. ఈ క్రమంలోనే రాబోయే 12-18 నెలల్లో గోల్డ్ రేటు కొత్త రికార్డ్ హైని తాకగలదని ట్రాయ్ అసెట్ మేనేజ్మెంట్ ఫండ్ మేనేజర్ చర్లొట్లె యంగ్ అంటున్నారు. అమెరికా-ఇరాన్ యుద్ధం, రష్యా-ఉక్రెయిన్ వార్, ట్రంప్ దుందుడుకు నిర్ణయాలు.. ప్రపంచ మార్కెట్లలో స్థిరత్వాన్ని లోపింపజేస్తాయని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

