Gold Price | ధర పెరిగినా తగ్గేదేలే అంటున్న జనం.. 11 నెలల్లో బంగారం దిగుమతి ఎంతో తెలుసా?!
Gold Price | ఒకవైపు బంగారం ధర పెరుగుతున్నా దిగుమతులు రికార్డు బ్రేక్ చేస్తున్నాయి. గత 11 నెలల్లో 73 శాతం పెరిగాయి.
Gold Price | బంగారం అంటే భారతీయ భామలకు ఎంతిష్టమో చెప్పనక్కర్లేదు. ఇంతకుముందుతో పోలిస్తే ధర పెరిగినా పుత్తడి కొనుగోలు చేయడానికే మొగ్గు చూపుతున్నారు. కరోనా నేపథ్యంలో 2020తో పోలిస్తే గతేడాది దేశంలో వివాహాలు, శుభకార్యాలు పెరగడం కూడా బంగారానికి గిరాకీ ఏర్పడటానికి కారణంగా కనిపిస్తున్నది. ప్రపంచంలోనే బంగారం దిగుమతుల్లో మనదేశం రెండో స్థానంలో నిలిచింది. పసిడి దిగుమతిలో తొలి స్థానంలో చైనా ఉంటుంది. మార్కెట్లో బంగారం ధర ( Gold Price ) పెరుగుతున్నా.. 2020-21తో పోలిస్తే 2021-22 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-ఫిబ్రవరి మధ్య దిగుమతులు 73 శాతం పెరిగి 45.1 బిలియన్ల డాలర్లకు దూసుకెళ్లాయి. ఫలితంగా విదేశాల్లో వాణిజ్యంలో కరంట్ ఖాతా లోటు (క్యాడ్) పైపైకి దూసుకెళ్లింది. 2020 ఏప్రిల్- 2021 ఫిబ్రవరి మధ్య వాణిజ్య లోటు 89 బిలియన్ డాలర్లయితే, 2021 ఏప్రిల్-2022 ఫిబ్రవరి మధ్య 176 బిలియన్ డాలర్ల వద్ద స్థిర పడింది.
2020-21లో బంగారం దిగుమతులు ఇలా
2020 ఏప్రిల్-2021 ఫిబ్రవరి మధ్య బంగారం దిగుమతులు 26.11 బిలియన్ డాలర్లు మాత్రమే. కానీ గత నెలలో బంగారం దిగుమతులు 11.45 శాతం తగ్గుముఖం పట్టడం గమనార్హం. కేంద్ర వాణిజ్యశాఖ గణాంకాల ప్రకారం గతనెలలో బంగారం దిగుమతుల విలువ 4.7 బిలియన్ డాలర్లు మాత్రమే.
పెరిగిన జెమ్స్, ఆభరణాల ఎగుమతులు
అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో జెమ్స్, ఆభరణాల ఎగుమతులు గణనీయ స్థాయిలో పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 57.5 శాతం పెరిగి 35.25 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అయితే, సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో భారత్ కరంట్ ఖాతా లోటు (క్యాడ్) 9.6 బిలియన్ల డాలర్లు (1.3 శాతం) పడిపోయాయని ఆర్బీఐ చెబుతున్నది.
సగటున బంగారం దిగుమతులు తక్కువేనా
అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బంగారం దిగుమతులు నెలవారీగా సాధారణ స్థాయికంటే తక్కువగా ఉన్నాయని జెమ్స్ అండ్ జ్యువెల్లరీ ఎక్స్‌పోర్ట్స్ ప్రమోషన్ కౌన్సిల్ (జీజేఈపీసీ) చైర్మన్ కొలిన్ షా తెలిపారు. 2021 ఏప్రిల్-2022 ఫిబ్రవరి మధ్య సగటున ప్రతి నెలా 76.57 టన్నుల బంగారం దిగుమతి అయ్యిందన్నారు. ఇది సాధారణ స్థాయికి తక్కువేనన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 11 నెలల్లో (ఏప్రిల్-ఫిబ్రవరి) బంగారం దిగుమతులు 842.28 టన్నులు.. కానీ సాధారణంగా ఇదే పీరియడ్‌లో ప్రతిఏటా బంగారం దిగుమతి 690-890 టన్నుల మధ్య తచ్చాడుతుందని కొలిన్‌షా పేర్కొన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

