స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

న్యూఢిల్లీ: దేశంలో బంగారం, వెండి లోహాల ధరలు స్వల్పంగా తగ్గాయి. ఇవాళ దేశ రాజధాని ఢిల్లీలో తులం 24 క్యారెట్ బంగారం ధర రూ. 149 తగ్గి రూ.44,350కి చేరింది. క్రితం ట్రేడ్లో తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.44,499 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో విలువైన లోహాల ధరలు రాత్రికిరాత్రి తగ్గుముఖం పట్టడమే దేశీయంగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టడానికి కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
దేశంలో కిలో వెండి ధర ఇవాళ రూ.866 తగ్గి రూ.64,607కు దిగివచ్చింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.65,473 వద్ద ముగిసింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో తాజాగా ఔన్స్ బంగారం ధర 1,729 అమెరికన్ డాలర్లు పలుకగా.. ఔన్స్ వెండి ధర 25.12 అమెరికన్ డాలర్లు పలికింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

