Smart Phone Sales | స్మార్ట్ ఫోన్లకు తగ్గిన గిరాకీ.. కారణం అదేనా..?!
Smart Phone Sales | 2022తో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ల విక్రయాలు 7.8 శాతం పడిపోయాయి. వరుసగా ఎనిమిదో త్రైమాసికంలో స్మార్ట్ ఫోన్ల విక్రయాలు తగ్గిపోయాయని ఐడీసీ వెల్లడించింది.
Smart Phone Sales | స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థలు ఎప్పటికప్పుడు అందుబాటులోకి వస్తున్న అత్యాధునిక టెక్నాలజీతో సరికొత్త ఫీచర్లు, భారీ బ్యాటరీ సామర్థ్యంతో కూడిన స్మార్ట్ ఫోన్లు తీసుకొస్తున్నా, వినియోగదారుల నుంచి గిరాకీ తగ్గుతోంది. 2022తో పోలిస్తే 2023 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో స్మార్ట్ ఫోన్ల విక్రయాలు 7.8 శాతం పడిపోయాయని ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) ప్రాథమిక నివేదిక పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ల సేల్స్‌పై ఐడీసీ ఎప్పటికప్పుడు నివేదికలు వెల్లడిస్తుంది.
ధరల పెరుగుదల, సూక్ష్మ ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు, భారీ నిల్వలతోపాటు గిరాకీ తగ్గడంతో వరుసగా ఎనిమిదో త్రైమాసికం.. అంటే రెండేండ్లుగా స్మార్ట్ ఫోన్ల సేల్స్ తగ్గుతున్నాయి. ఇంతకుముందు త్రైమాసికాలతో పోలిస్తే స్మార్ట్ ఫోన్ల విక్రయాలు నెమ్మదిస్తున్నాయని ఐడీసీ వివరించింది. కాకపోతే స్మార్ట్ ఫోన్ల సంస్థల వద్ద ఫోన్ల నిల్వల పరిస్థితి కాస్త మెరుగు పడింది. జూలై- సెప్టెంబర్ త్రైమాసికంలో సేల్స్‌లో అదనపు నిల్వలు గల స్మార్ట్ ఫోన్లు అమ్ముడవుతాయని ఐడీసీ వెల్లడించింది.
ఈ ఏడాది చివరికి స్మార్ట్ ఫోన్ల సేల్స్‌లో గ్రోత్తో 2024లో అడుగు పెడతామని ఐడీసీ రీసెర్చ్ డైరెక్టర్ నబిల్లా పొపాల్ తెలిపారు. చైనాలో ఐదు త్రైమాసికాల తర్వాత సెల్ ఫోన్ల సేల్స్‌లో డబుల్ డిజిట్ క్షీణత నమోదైంది. కానీ, 2022తో పోలిస్తే ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో స్మార్ట్ ఫోన్ సేల్స్ 2.1 శాతం పడిపోయాయి. ఆసియా / పసిఫిక్ రీజియన్ పరిధి (జపాన్, చైనా మినహా) 5.9 శాతం, అమెరికాలో 19.1 శాతం యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా దేశాల పరిధిలో 3.1 శాతం సేల్స్ తగ్గాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

