పండగ సీజన్లో ధరల మంట : కార్లు, బైక్‌లు, స్మార్ట్పోన్లు, టీవీల ధరలకు రెక్కలు!

న్యూఢిల్లీ : పండగ సీజన్లో ఏది కొనాలన్నా ఈసారి జేబుకు చిల్లు పడేలా ఉంది. కార్లు, బైక్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, ఫ్రిజ్, ఏసీ సహా పలు వస్తువుల ధరలు ఏకంగా 8 శాతం వరకూ ఎగబాకనున్నాయి. ముడిపదార్ధాలు, సరుకు రవాణా వ్యయం పెరగడంతో ఈ ఏడాది మరోసారి ధరల పెంపునకు కంపెనీలు మొగ్గుచూపుతున్నాయి. పండగ సీజన్లో కన్జూమర్ ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు 8 శాతం వరకూ పెరగనుండగా, కార్లు, బైక్‌ల ధరలు రాబోయే వారాల్లో రెండు శాతం వరకూ భారం కానున్నాయి.
పండగ సీజన్లో కార్లు, బైక్‌లు మోడల్‌ను బట్టి రూ 5,000 నుంచి రూ 10,000 వరకూ భారమవుతాయని భావిస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే కార్లు, ద్విచక్రవాహనాల ధరలు పలుమార్లు పెరగ్గా తాజా పెంపుతో పండగ సీజన్ అమ్మకాలు దెబ్బతింటాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. స్టీల్ ధరలు రెట్టింపు కావడం, అల్యూమినియం, రాగి ధరలు 25 శాతం వరకూ ఎగబాకడం, చిప్ ధరలు 25 నుంచి 75 శాతం వరకూ పెరగడంతో తయారీదారులకు ముడిపదార్ధాల వ్యయం ఇబ్బడిముబ్బడిగా పెరగడంతో కస్టమర్లపై కొంత భారం మోపక తప్పడం లేదని చెబుతున్నారు.
ఇక స్మార్ట్‌ఫోన్ ధరలు న్యూ మోడల్స్ 3 నుంచి 5 శాతం పెరగనుండగా కొన్ని తాజా మోడళ్లు సైతం భారం కానున్నాయి. బాష్, హిటాచి వంటి అప్లయన్స్ బ్రాండ్లు 3 నుంచి 8 శాతం తమ ఉత్పత్తుల ధరలను పెంచనున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
Family suicide | గచ్చిబౌలిలోని ఇంట్లో నుంచి దుర్వాసన.. పోలీసులు వచ్చి చూడగా..
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

