తగ్గిన ఆభరణాల ఎగుమతులు
ఆభరణాల ఎగుమతులు తగ్గుముఖం పట్టాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో జెమ్స్ అండ్ జ్యూవెల్లరీ ఎగుమతులు ఏడాది ప్రాతిపదికన 12.17 శాతం తగ్గి రూ.2,65,187.95 కోట్లు (32,022.08 మిలియన్ డాలర్లు)కు తగ్గాయని జెమ్ అండ్ జ్యూవెల్లరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్(జీజేఈపీసీ) వెల్లడించింది.
- 2023-24లో రూ.2.65 లక్షల కోట్లకు: జీజేఈపీసీ
ముంబై, ఏప్రిల్ 20: ఆభరణాల ఎగుమతులు తగ్గుముఖం పట్టాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో జెమ్స్ అండ్ జ్యూవెల్లరీ ఎగుమతులు ఏడాది ప్రాతిపదికన 12.17 శాతం తగ్గి రూ.2,65,187.95 కోట్లు (32,022.08 మిలియన్ డాలర్లు)కు తగ్గాయని జెమ్ అండ్ జ్యూవెల్లరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్(జీజేఈపీసీ) వెల్లడించింది. అమెరికాలో వడ్డీరేట్లు క్రమంగా పెరుగుతుండటం, చైనా మందకొడి వృద్ధిని నమోదు చేసుకోవడం ఇందుకు కారణమని విశ్లేషించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.3,01,925.97 కోట్లు(37,646.17 మిలియన్ డాలర్లు) విలువైన ఆభరణాలు ఎగమతి అయ్యాయి. గతేడాది ఆభరణాల ఎగుమతులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయని, అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగించడం ఇందుకు కారణమని జీజేఈపీసీ చైర్మన్ విపుల్ షా తెలిపారు.
- కట్ అండ్ పాలిష్డ్ డైమండ్ల ఎగుమతులు కూడా 25.23 శాతం తగ్గి రూ.1,32,128.29 కోట్లకు తగ్గాయి. క్రితం ఏడాది రూ.1,76,716.06 కోట్లు(22,046.9 మిలియన్ డాలర్లు)గా నమోదయ్యాయి.
- పాలిష్డ్ ల్యాబ్ డైమాండ్ల ఎగుమతులు కూడా ఏడాది ప్రాతిపదికన 13.79 శాతం తగ్గి రూ.13,468.32 కోట్ల నుంచి రూ.11,611.25 కోట్లకు తగ్గాయి.
- కానీ, బంగారు ఆభరణాల ఎగుమతులు 20.57 శాతం పెరిగి రూ.92,346.19 కోట్లు(11,140.780 మిలియన్ డాలర్లు)గా నమోదయ్యాయి. ఏడాది క్రితం ఇది రూ.76,589.94 కోట్లు(9,538.84 మిలియన్ డాలర్లు)గా ఉన్నది.
- వెండి ఆభరణాల ఎగుమతులు 43 శాతం తగ్గి రూ.23,556.71 కోట్ల నుంచి రూ.13,406.1 కోట్లకు పరిమితమయ్యాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

