Electric Vehicles Funding | జెట్‌స్పీడ్‌లో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఫండింగ్..!
Electric Vehicles Funding | గతంతో పోలిస్తే 2022లో ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీ రంగంలో నిధుల సేకరణ 117 శాతం గ్రోత్ నమోదైంది.
Electric Vehicles Funding | భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్‌కు క్రమంగా ఆదరణ పెరుగుతోంది. 2021తో పోలిస్తే 2022లో విద్యుత్ వాహనాల తయారీ సంస్థల కోసం నిధుల సేకరణ 117 శాతం పెరిగి 160 కోట్ల డాలర్లకు దూసుకెళ్లినట్లు గణాంకాలు చెబుతున్నాయి. కంపెనీల రూపంలో భారత్ మూడో స్థానంలో ఉన్నది. అమెరికా, చైనా తర్వాత భారత్‌లో అత్యధికంగా వెహికల్స్ కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. నిధుల సేకరణ విషయంలో భారత్‌ది నాలుగో స్థానం.
ఇవీ సానుకూల పరిస్థితులు
పెరుగుతున్న ఆయిల్ ధరలు, పర్యావరణం పరిరక్షణ పట్ల అవగాహన పెరుగుదలతోపాటు ఫేమ్-2 తరహ ప్రభుత్వ సానుకూల ఇన్సియేటివ్స్, ప్రజా రవాణా వ్యవస్థ విద్యుద్ధీకరణలో వేగం వంటి అంశాలు విద్యుత్ వాహనాల తయారీ, వాటికి అవసరమైన నిధుల సేకరణ వేగం పుంజుకుంటున్నది. ఈ అంశాలన్నీ విద్యుత్ వెహికల్స్ మార్కెట్ విస్తరణకు కారణం అవుతున్నాయి.
విడి భాగాలపై సుంకాల రాయితీ
ఎలక్ట్రిక్ వెహికల్స్ బ్యాటరీల తయారీ యంత్రాలు, కాపిటల్ గూడ్స్ మీద బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీ రాయితీ కల్పించింది. పెట్టుబడుల పురోభివృద్ధికి, ధరలను తగ్గించడానికి ఎలక్ట్రిక్ వెహికల్స్ లిథియం బ్యాటరీలపై డ్యూటీ 21 నుంచి 13 శాతానికి కుదించేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. 2021లో 766 మిలియన్ డాలర్ల నిధులు సేకరిస్తే, విద్యుత్ వాహనాల తయారీ కోసం 2022లో 1.66 బిలియన్ డాలర్ల నిధులు సమీకరించాయి ఆయా సంస్థలు. 2021తో పోలిస్తే ఇది 117 శాతం వృద్ధి.
ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీకి కంపెనీల నిధుల సేకరణ తీరు తెన్నులు ఇలా..!
మొత్తం కంపెనీలు : 978.
ఫండెడ్ కంపెనీలు : 246.
మొత్తం ఫండింగ్ : 360 కోట్ల డాలర్లు.
గత రెండేండ్లలో ఫండింగ్: 250 కోట్ల డాలర్లు.
2021లో ఫండింగ్ : 766 మిలియన్ డాలర్లు.
2022లో ఫండింగ్ : 160 కోట్ల డాలర్లు.
2023లో ఫండింగ్ 76.2 మిలియన్ డాలర్లు.
14 కంపెనీల స్వాధీనాలు.
ఐపీఓకు వెళ్లిన సంస్థలు నాలుగు.
బిజినెస్ మోడల్ – ఫండింగ్
ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థలు : 496 మిలియన్ డాలర్లు.
ఈ-స్కూటర్ల తయారీ సంస్థలు : 316 మిలియన్ డాలర్లు.
స్టేషన్ బేస్డ్ ఈ-బైక్ రెంటల్స్ : 83 మిలియన్ డాలర్లు.
ఈవీ అల్యూమినియం ఫ్యుయల్ సెల్స్: 62.2 మిలియన్ డాలర్లు.
ఈ-రిక్షా రైడ్ హెయిలింగ్: 50 మిలియన్ డాలర్లు.
ఈ-మోటర్ సైకిల్ తయారీదార్లు: 46.6 మిలియన్ డాలర్లు.
ఈవీ లిథియాన్ బ్యాటరీ: 16.5 మిలియన్ డాలర్లు.
ఫాస్టర్ చార్జింగ్ లిథియాన్ బ్యాటరీ : 14.6 మిలియన్ డాలర్లు.
ఈ-బైస్కిల్ తయారీదారులు : 5.8 మిలియన్ డాలర్లు.
ఈవీ చార్జింగ్ స్టేషన్ డిస్కవరీ ప్లాట్ ఫామ్ : 5.8 మిలియన్ డాలర్లు.
2022లో నిధులు సేకరించిన సంస్థలు
అంపేర్ వెహికల్స్ : 220 మిలియన్ డాలర్లు.
ఓలా ఎలక్ట్రిక్ : 200 మిలియన్ డాలర్లు.
ఎథేర్ ఎనర్జీ : 128 మిలియన్ డాలర్లు.
యులు: 83 మిలియన్ డాలర్లు.
ఎథేర్ ఎనర్జీ: 50 మిలియన్ డాలర్లు.
మావ్టో : 50 మిలియన్ డాలర్లు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

