Aadhar Update | ఆధార్ ఫ్రీ అప్డేట్.. జూన్ వరకూ గడువు పొడిగింపు..!
Aadhar Update | పదేండ్ల క్రితం ఆధార్ నమోదు చేసుకున్న వారు తమ వివరాలను ఫ్రీగా అప్ డేట్ చేసుకునేందుకు భారత విశిష్ట ప్రాధికార సంస్థ (ఉడాయ్) జూన్ 14 వరకూ గడువు పొడిగించింది.
Aadhar Update | పాఠశాలలో అడ్మిషన్ మొదలు బ్యాంకు ఖాతా ఓపెన్ చేయడం వరకూ ప్రతి అంశంలోనూ ఆధార్ కార్డు తప్పనిసరి. ఒకసారి ఆధార్ నమోదు చేసుకున్న వారు ప్రతి పదేండ్లకోసారి అప్డేట్ చేసుకోవాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) సూచించింది అందుకు అనుగుణంగా ఆధార్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు కేంద్రం ఇచ్చిన గడువు శనివారంతో ముగిసిపోతున్నది. ఈ నేపథ్యంలో భారత విశిష్ట ప్రాధికార సంస్థ (ఉడాయ్) మరో ఆరు నెలలు అంటే 2025 జూన్ 14 వరకూ గడువు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. అంటే ఆధార్‌లో అడ్రస్‌లో మార్పులు చేసుకోవాలంటే వెంటనే ఆన్ లైన్లో అప్డేట్ చేసుకోవచ్చు. పదేండ్లకోసారి ఆధార్ వివరాలు అప్ డేట్ చేసుకోవడానికి ఆధారాలు గల పత్రాలు సబ్మిట్ చేయాలి. అయితే ‘మై ఆధార్’ పోర్టల్ ద్వారా మాత్రమే ఉచితంగా లభిస్తాయి. పేరు, పుట్టిన తేదీ, అడ్రస్ వంటి అంశాల్లో మార్పులు చేసుకోవచ్చు. గడువు ముగిసిన తర్వాత గతంలో మాదిరిగానే ఆధార్ కేంద్రాల్లో రూ.50 చెల్లించి అప్ డేట్ చేసుకోవాలి.
ఆన్లైన్లో ఉచితంగా ఆధార్ అప్డేట్ చేసుకోవాలంటే ముందు యూఐడీఏఐ వెబ్సైట్లో లాగిన్ కావాలి. అటుపై మీ రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్ నంబర్‌కు వచ్చే ఓటీపీతో లాగిన్ కాగానే, అప్పటికే ఉన్న మీ వివరాలు స్క్రీన్ మీద కనిపిస్తాయి. అందులో ఉన్న వివరాలు సరిగ్గా ఉన్నాయా.. లేదా.. చెక్ చేసుకోవాలి. వాటిని సవరించాల్సి వస్తే సవరించాలి. వాటిని ధృవీకరించుకుని నెక్ట్స్ ఆప్షన్ క్లిక్ చేయాలి. తర్వాత కనిపించే డ్రాప్ డౌన్ లిస్ట్ సాయంతో డాక్యుమెంట్లు ఎంచుకోవాలి. ఆయా డాక్యుమెంట్ల స్కాన్డ్ పత్రాలు అప్ లోడ్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి. 14 అంకెల అప్ డేట్ రిక్వెస్ట్ నంబర్ రావడంతో అప్ డేట్ స్టేటస్ ఎక్కడి వరకూ వచ్చిందో చెక్ చేసుకోవచ్చు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
Weight Loss Medicine | బరువు తగ్గించే మందులను వైద్య సలహా లేకుండా వాడితే ప్రమాదం.. ఎందుకంటే..?
Chandrayan | ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ.. గ్రామీణ కుర్రాళ్ల అంతరిక్ష కల ఎలా ఉందంటే?
‘తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ప్రతీక కాళోజీ’
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

