Ford India | మరో కంపెనీకి ఫోర్డ్ చెన్నై యూనిట్ సేల్?!.. అదే జరిగితే 2,600 మందికి రిలీఫ్!
Ford India | ఫోర్డ్ చెన్నై యూనిట్‌ను మరో సంస్థకు విక్రయ యత్నాలు జరుగుతున్నాయి. అదే జరిగితే 2,600 మంది ఉద్యోగులకు రిలీఫ్ లభించినట్లే.

Ford India | ఇండియాలో ఉత్పత్తి నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన అమెరికా కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ చెన్నై యూనిట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్. చెన్నైకి సమీపంలోని మరాయిమలాయి నగర్లో గల ఈ యూనిట్‌ను మరో కంపెనీకి విక్రయించాలని ఫోర్డ్ ఇండియాను తమిళనాడు ప్రభుత్వం కోరింది. అదే జరిగితే ఆ యూనిట్లో పని చేస్తున్న 2600 మంది ఉద్యోగులకు రిలీఫ్ లభించినట్లే.
ఏప్రిల్ నుంచి చెన్నై యూనిట్లో ఉత్పత్తి నిలిపివేత
వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం నుంచి చెన్నై యూనిట్లో ఉత్పత్తిని నిలిపివేయనున్నట్లు ఫోర్డ్ ఇండియా తెలిపింది. ఈ యూనిట్ విక్రయానికి ఫోర్డ్ ఇండియాకు మంచి డీల్ లభిస్తే.. ఇదే స్థలాన్ని సదరు ఆటోమొబైల్ కంపెనీకి కేటాయిస్తామని తమిళనాడు పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ మురుగానందం మీడియాకు చెప్పారు.
ఓలా, మహీంద్రాలతో చర్చలు..
ఫోర్డ్ ఇండియా కార్ల ఉత్పాదక కాంట్రాక్ట్ లేదా యూనిట్ విక్రయం కోసం ఓలా, మహీంద్రా అండ్ మహీంద్రాతో చర్చలు జరిగాయి. ఈ మూడు సంస్థల మధ్య జరిగిన చర్చల ఫలితం ఏమిటన్నది బయటకు రాలేదు. ఫోర్డ్ ఇండియా మూసివేతతో నేరుగా 4000 మంది, పరోక్షంగా 40 వేల మంది జీవితాలపై ప్రభావం పడనుందని తెలుస్తున్నది. గుజరాత్‌లోని సనంద్ యూనిట్ ప్రస్తుత త్రైమాసికంలోనే మూత పడనున్నది.
ఇదీ ఫోర్డ్ ఇండియా యూనిట్ల కెపాసిటీ..
చెన్నై ఫోర్డ్ ఇండియా యూనిట్ ఏడాదిలో రెండు లక్షల కార్లు, 3.40 లక్షల ఇంజిన్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది. ఫోర్డ్ ఎకోస్పోర్ట్, ఫోర్డ్ ఏండీవర్ వేరియంట్ కార్ల ఉత్పత్తి కోసం రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టింది. సనంద్ యూనిట్ 2.40 లక్షల కార్లు, 2.70 లక్షల ఇంజిన్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది. 37 దేశాలకు ఈ కార్లను ఎగుమతి చేయాలని ఫోర్డ్ ఇండియా లక్ష్యంగా పెట్టుకున్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి:
World Trade Center : ఉగ్రవాదుల అమానుష దాడికి 20 ఏండ్లు పూర్తి
IT Returns | బిగ్ రిలీఫ్.. ఐటీ రిటర్న్స్ గడువు పొడిగించిన కేంద్రం
RBI rule on ATM | గ్రామీణులకు షాక్.. ఏటీఎంలు ఎత్తేస్తున్న బ్యాంకులు?!
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
రైస్ మిల్లు యజమాని మాయాజాలం.. రూ.7.85 కోట్ల ధాన్యం మాయం!
Ala venkateshwar reddy | పెద్దవాగు వెంట రైతులతో ఆల వెంకటేశ్వర్ రెడ్డి పాదయాత్ర.. వివరాలివే
minister bhoomipuja for traffic signal | ట్రాఫిక్ సిగ్నల్ కోసం భూమిపూజ చేసిన బీజేపీ మంత్రి.. సోషల్ మీడియాలో గొప్పగా ప్రచారం
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

