న్యూఢిల్లీ : రగ్గ్డ్ స్మార్ట్వాచ్లంటే ముందుగా యాపిల్ వాచ్ అల్ట్రా, గర్మిన్ ఇన్స్టింక్ట్ సొలార్ పేర్లు గుర్తుకువస్తాయి. అయితే ఈ రెండు స్మార్ట్‌వాచ్‌ల ఖరీదు అధికం కావడంతో అందరూ వీటని కొనుగోలు చేయలేరు. ఈ తరహా కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని ఫైర్ బోల్ట్ సాహసికుల కోసం తొలి రగ్గ్డ్ స్మార్ట్‌వాచ్ కోబ్రాను లాంఛ్ చేసింది.
ఈ డివైజ్ 1.78 ఇంచ్ డిస్ప్లే, బ్లూటూత్ కాలింగ్ సహా పలు లేటెస్ట్ ఫీచర్లను కలిగిఉంది. ఫైర్ బోల్ట్ ఆల్ న్యూ అవుట్డోర్ సిరీగా కోబ్రా స్మార్ట్‌వాచ్‌ను కస్టమర్ల ముందుకు తీసుకువచ్చామని ఫైర్ బోల్ట్ సహ వ్యవస్ధాపకకులు ఆయుషి కిషోర్, అర్ణవ్ కిషోర్ వెల్లడించారు. రూ. 3499కి లభించే ఫైర్ బోల్ట్ కోబ్రా స్మార్ట్‌వాచ్ జనవరి 31 నుంచి ఫ్లిప్‌కార్ట్, ఫైర్ బోల్ట్ సైట్లపై అందుబాటులో ఉంటుంది.
కోబ్రా వాచ్ సాలిడ్ గ్రీన్, సాలిడ్ బ్లాక్, కామ్ఫ్లేజ్ గ్రీన్, కామ్ఫ్లేజ్ బ్లాక్ కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది. 123 స్పోర్ట్స్ మోడ్స్, ఇంటెలిజెంట్ స్పోర్ట్స్ అలాగరిథమ్ ఫీచర్‌తో కోబ్రా స్మార్ట్‌వాచ్ కస్టమర్లను ఆకట్టుకుంటుంది. రగ్గ్డ్ బాడీతో పాటు ఫైర్ బోల్ట్ కోబ్రా ఒకసారి చార్జింగ్ చేస్తే 15 రోజులు రన్ అవుతుందని కంపెనీ పేర్కొంది.