మైనింగ్ సంస్కరణలతో కొలువుల జోరు : ఫిక్కీ

న్యూఢిల్లీ : మైనింగ్ సంస్కరణలతో దేశ జీడీపీ పరుగులు పెట్టడంతో పాటు పెద్దసంఖ్యలో ఉపాధి అవకాశాలు ముందుకు వస్తాయని పరిశ్రమ సంఘాల సంస్థ ఫిక్కీ పేర్కొంది. ఖనిజాల వెలికితీత, ఉత్పత్తి, దేశీ సరఫరాలను పెంచడంతో పాటు గనుల యజమానులపై ఆర్థిక ఒత్తిళ్లు తగ్గించడం ద్వారా దేశ జీడీపీకి మైనింగ్ రంగం నుంచి భారీగా ప్రాతినిథ్యం పెరిగే చర్యలు చేపట్టాలని తాము చాలాకాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నామని ఫిక్కీ పేర్కొంది. ఈ రంగంలో పెట్టుబడులను ఆకర్షించి సులభతర వాణిజ్యాన్ని పెంపొందించేందుకు తాజా సంస్కరణలు ఉపకరిస్తాయని స్వాగతించింది.
ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా ఇటీవల మైనింగ్ రంగంలో చేపట్టిన సంస్కరణల ఫలితంగా జీడీపీకి ఈ రంగం నుంచి ప్రాతినిథ్యం పెరగడం వృద్ధికి ఊతమిస్తుందని ఫిక్కీ మైనింగ్ కమిటీ చీఫ్ తుహిన్ ముఖర్జీ పేర్కొన్నారు. సంస్కరణలతో మైనింగ్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడం, సులభతర వాణిజ్యం సాధ్యమవుతాయని అన్నారు. మైనింగ్ రంగ సంస్కరణలతో ఆత్మనిర్భర్ భారత్‌లో గనుల రంగం కీలకమని ప్రభుత్వం గుర్తించినట్టు వెల్లడైందని ఫిక్కీ మైనింగ్ కమిటీ ఉపాధ్యక్షుడు, వేదాంత సీఈవో (అల్యూమినియం, పవర్) రాహుల్ శర్మ పేర్కొన్నారు. దేశంలో వేలం వేయని క్యాప్టివ్ గనులను సులభంగా బదిలీ చేసే ప్రక్రియను చేపట్టడం కూడా మైనింగ్ రంగ పురోగతికి ఊతమిస్తుందని వ్యాఖ్యానించారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

