Fast Charging EV Battery | 5 నిమిషాల్లో ఫుల్ చార్జి.. 482 కి.మీ ప్రయాణం.. ఈ బ్యాటరీ స్పెషాలిటీ..!
Fast Charging EV Battery | ఎలక్ట్రిక్ వాహనాల యజమానులకు రిలీఫ్ కల్పించేందుకు అమెరికా కార్నెల్ యూనివర్సిటీ రీసెర్చర్లు పూనుకున్నారు. అతి తక్కువ టైంలో చార్జింగయ్యే న్యూ లిథియం బ్యాటరీని డెవలప్ చేశారు.
Fast Charging EV Battery | రోజురోజుకు టెక్నాలజీ డెవలప్ అవుతోంది. మరోవైపు పర్యావరణ పరిరక్షణ కోసం ప్రపంచ దేశాలన్నీ పెట్రోలియం ఉత్పత్తుల వాడకం తగ్గించుకునే పనిలో పడ్డాయి. తదనుగుణంగా పెట్రోల్ / డీజిల్ వినియోగ వాహనాలు ఎలక్ట్రిక్ వాహనాలుగా రూపాంతరం చెందుతున్నాయి. కానీ, ఇప్పటికిప్పుడు పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాలకు అనుగుణంగా ఎక్కడ ఈవీ చార్జింగ్ మౌలిక వసతుల్లేవు. కొన్ని దేశాల్లో ఉన్నా, చార్జింగ్ కోసం గంటలకొద్దీ వెయిట్ చేయాల్సి వస్తున్నది.
ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు అమెరికా కార్నెల్ యూనివర్సిటీ రీసెర్చర్లు ముందుకు వచ్చారు. అధునాతన లిథియం బ్యాటరీని డెవలప్ చేశారు. ఈ బ్యాటరీ పూర్తి స్థాయిలో చార్జింగ్ కావడానికి ఐదంటే ఐదు నిమిషాలే పడుతుంది. ఇలా సింగిల్ చార్జింగ్ అయితే ఈ బ్యాటరీతో 482 కి.మీ దూరం ప్రయాణించొచ్చునని సమాచారం.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈవీ కార్లు, మోటారుసైకిళ్లు, స్కూటర్లకు ఫాస్ట్ చార్జింగ్ ఫెసిలిటీస్ ఉన్నా కనీసం అర్ధగంట పడుతుంది. కార్నెల్ యూనివర్సిటీ రీసెర్చర్స్ టీం పరిశోధన విజయవంతమైతే వాహనదారులకు టైం చాలా కలిసి వస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాలకు నార్మల్ హోం చార్జర్ సాయంతో ఫుల్ చార్జింగ్ కావడానికి సుమారు నాలుగైదు గంటల నుంచి ఆరేడు గంటలు పడుతుంది. ఈవీ వాహనాలను నడపాలంటే ముందస్తుగా బ్యాటరీ చార్జింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కార్నెల్ యూనివర్సిటీ రీసెర్చర్ల టీం డిజైన్ చేసిన బ్యాటరీ ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘సర్ ప్రక్రియపై నిష్పాక్షిక విచారణ జరపాలి’
‘యుద్ధాలతో మానవాళికి అపార నష్టం.. శాంతితోనే ప్రపంచ ప్రగతి’
CJP Protest | ఢిల్లీ పోలీసులు ఎక్కడ అడ్డుకుంటే.. అక్కడ నిరసనలు కొనసాగించండి: అజింక్య షిండే
INDIA bloc | సీఈసీ రాజీనామా డిమాండ్ మరింత ఉధృతం.. సోమవారం భారీ నిరసనకు సిద్ధమైన ఇండియా బ్లాక్
AB de Villiers | వయసు పైబడినా చేవ తగ్గలే.. 37 బంతుల్లోనే డివిలియర్స్ శతకమోత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

