కందుకూరు తహసీల్ ఆఫీస్ ముట్టడి
న్యాయం స్థానంలో కేసు ఉండగానే కోట్ల రూపాయల విలువచేసే తమ భూములు మరొకరి పేరు మీదికి ఎలా మారాయని ప్రశ్నిస్తూ రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం పెరుగుగూడ రైతులు బుధవారం తహసీల్ ముట్టడించారు. పెరుగుగూడ రెవెన్యూ పరిధిలోని 1,2 సర్వే నంబర్లలో ఉన్న 24.35 ఎకరాల భూములు పూర్వం సయ్యద్ మొహినుద్దీన్ పేర రెవెన్యూ రికార్డుల్లో ఉండేవి. 1974 నుంచి ఆ భూములను బాచుపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి ఆగయ్య, శంకరయ్య, జంగయ్య, నర్సింహులు తదితరులు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
- పెట్రోల్ బాటిల్‌తో వచ్చిన బాధిత మహిళా రైతు
- న్యాయం చేయాలని పట్టుబట్టిన రైతులు
కందుకూరు, అక్టోబర్ 14: న్యాయం స్థానంలో కేసు ఉండగానే కోట్ల రూపాయల విలువచేసే తమ భూములు మరొకరి పేరు మీదికి ఎలా మారాయని ప్రశ్నిస్తూ రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం పెరుగుగూడ రైతులు బుధవారం తహసీల్ ముట్టడించారు. పెరుగుగూడ రెవెన్యూ పరిధిలోని 1,2 సర్వే నంబర్లలో ఉన్న 24.35 ఎకరాల భూములు పూర్వం సయ్యద్ మొహినుద్దీన్ పేర రెవెన్యూ రికార్డుల్లో ఉండేవి. 1974 నుంచి ఆ భూములను బాచుపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి ఆగయ్య, శంకరయ్య, జంగయ్య, నర్సింహులు తదితరులు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
మొహినుద్దీన్ వారసులు ఎవరూ లేకపోవడంతో 1984వ సంవత్సరంలో అప్పటి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆయా భూములను నలుగురి పేరు మీద రెవెన్యూ పట్టా సర్టిఫికెట్లు జారీ చేశారు. కుమ్మరి ఆగయ్య పేరును రెవెన్యూ రికార్డుల్లో పీటీదారుడుగా నమోదు చేశారు. అదే గ్రామానికి చెందిన పోచయ్య తండ్రి పేరు రామయ్యగా ఉన్నప్పటికీ, పోచయ్య కూతురు బాలనర్సమ్మ మాత్రం 1,2 సర్వే నంబర్లలోని 24.35 ఎకరాల భూములకు పీటీదారుడు తమ తాత ఆగయ్య అని పేర్కొంటూ 2006వ సంవత్సరంలో అప్పటి తహసీల్దార్ ద్వారా ఫ్యామిలి సర్టిఫికెట్ పొందారు.
న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల మేరకు 2022వ సంవత్సరంలో అప్పటి ఆర్డీవో వెంకటాచారి, ఈ భూములు బాలనర్సమ్మకు చెందినవని పేర్కొంటూ 38ఈ సర్టిఫికెట్ జారీ చేశారు. కానీ, 1974 నుంచి ఆ భూములను సాగు చేస్తూ రెవెన్యూ రికార్డుల్లో ఉన్న సుమారు 45 మంది రైతులు విషయం తెలుసుకొని తమ భూములను ఇతరుల పేరిట మార్చడం ఏందని 2022లో రంగారెడ్డి జిల్లా కోర్టును ఆశ్రయించారు.
ఈ భూములకు బాలనర్సమ్మకు ఎలాంటి సంబంధం లేదని, వాటిని బాలనర్సమ్మ పేరిట పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం ఏమిటని ప్రశ్నిస్తూ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల విన్నపం మేరకు రెవెన్యూ రికార్డుల్లో పేర్లు ఉండేలా ఆర్డీవో, జిల్లా జాయింట్ కలెక్టరుకు నివేదికలు పంపిస్తామని తహసీల్దార్ హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. కాగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు రైతుల ఆందోళన కొనసాగింది. కాగా అప్పటి ఆర్డీవో, జాయింట్ కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్ మేరకే బాలనర్సమ్మ పేరిట రికార్డులను మార్చినట్టు తహసీల్దార్ గోపాల్ తెలిపారు.
పెట్రోల్ బాటిల్‌తో బాధిత మహిళ
బాధిత రైతు అరుణమ్మ పెట్రోల్ బాటిల్‌తో తహసీల్ ఆఫీస్‌లోకి వచ్చి ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఇది గమనించిన స్థానిక పోలీసులు ఆమె చేతిలో ఉన్న పెట్రోల్ బాటిల్‌ను తీసుకోవడంతో ప్రమాదం తప్పింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

