ఫెయిర్‌ఫాక్స్ చేతికి ఐడీబీఐ బ్యాంక్
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ ఐడీబీఐని.. ప్రైవేట్‌పరం చేయాలని గత కొన్నేండ్లు (2022 నుంచి)గా మోదీ సర్కార్ చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. బ్యాంక్‌లో మెజారిటీ వాటాను వ్యూహాత్మకంగా కొనేందుకు ముందుకొచ్చిన కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ అనుబంధ సంస్థ (M/s 10955230 Canada Inc) ప్రతిపాదనకు ఆర్థిక వ్యవహారాలపై ఏర్పాటైన క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) బుధవారం పచ్చ జెండా ఊపింది. దీంతో ఐడీబీఐ బ్యాంక్‌లో రూ.52,878 కోట్ల (దాదాపు 5.6 బిలియన్ డాలర్లు)తో 60.72 శాతం వాటా ఫెయిర్‌ఫాక్స్ హస్తగతమవుతున్నది.
- మెజారిటీ వాటాను దక్కించుకుంటున్న కెనడా సంస్థ
- ఆర్థిక వ్యవహారాలపై క్యాబినెట్ కమిటీ ఆమోదం
- రూ.52,878 కోట్లతో 60.72 శాతం వాటా హస్తగతం
- దేశీయ ఆర్థిక రంగంలో ఇదే అతిపెద్ద ఎఫ్‌డీఐ
న్యూఢిల్లీ, అక్టోబర్ 14: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ ఐడీబీఐని.. ప్రైవేట్‌పరం చేయాలని గత కొన్నేండ్లు (2022 నుంచి)గా మోదీ సర్కార్ చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. బ్యాంక్‌లో మెజారిటీ వాటాను వ్యూహాత్మకంగా కొనేందుకు ముందుకొచ్చిన కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ అనుబంధ సంస్థ (M/s 10955230 Canada Inc) ప్రతిపాదనకు ఆర్థిక వ్యవహారాలపై ఏర్పాటైన క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) బుధవారం పచ్చ జెండా ఊపింది. దీంతో ఐడీబీఐ బ్యాంక్‌లో రూ.52,878 కోట్ల (దాదాపు 5.6 బిలియన్ డాలర్లు)తో 60.72 శాతం వాటా ఫెయిర్‌ఫాక్స్ హస్తగతమవుతున్నది.
కాగా, ఓ భారతీయ బ్యాంక్‌లోకి ఇంత పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడి రావడం ఇదే తొలిసారి. ఇక ఈ డీల్‌లో భాగంగా బ్యాంక్‌లో కేంద్ర ప్రభుత్వానికి చెందిన 30.48 శాతం వాటాను, ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీకి చెందిన 30.24 వాటాను బిలియనీర్ ప్రేమ్ వాత్స సారథ్యంలోని గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్ కంపెనీ అయిన ఫెయిర్‌ఫాక్స్ చేజిక్కించుకుంటున్నది. ఇందుకుగాను కేంద్రానికి సుమారు రూ.26,600 కోట్లు, ఎల్ఐసీకి దాదాపు రూ.26,400 కోట్లు సదరు సంస్థ నుంచి రానున్నాయి. ఒక్కో షేర్‌కు రూ.81 చొప్పున చెల్లించనున్నది.
ఇక ఈ డీల్ వచ్చే ఏడాది మార్చి ఆఖరుకల్లా పూర్తికావచ్చని తెలుస్తుండగా.. ఆర్బీఐ, సీసీఐ, ఇతర రెగ్యులేటరీ అనుమతులు కావాల్సి ఉన్నది. కాగా, ఐడీబీఐ బ్యాంక్ వ్యూహాత్మక పునర్వ్యవస్థీకరణకు సీసీఈఏ ఆమోదం తెలుపడాన్ని.. దేశీయ బ్యాంకింగ్ రంగానికి లభించిన గొప్ప ఉత్సాహంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అభివర్ణించారు. ఇక బ్యాంక్ రికవరీకి ప్రభుత్వం ఇన్నాళ్లూ మద్దతిచ్చిందంటూ ‘ఎక్స్’లో చెప్పుకొచ్చిన మంత్రి.. ఇప్పటికీ కేంద్రానికి మైనారిటీ వాటా ఉన్నదని గుర్తుచేశారు. మొత్తానికి దేశంలోకి మరిన్ని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)కు ఐడీబీఐ డీల్ బాటలు వేసిందని అభిప్రాయపడ్డారు.
- ఆర్బీఐ నిబంధనల ప్రకారం బ్యాంక్‌లో ప్రమోటర్లకు 26 శాతానికి మించి వాటా ఉండరాదు. వచ్చే 15 ఏండ్లలో ఫెయిర్‌ఫాక్స్ వాటాను తగ్గించుకోవాలి.
- ఇప్పటికే కేరళకు చెందిన సీఎస్బీ బ్యాంక్‌లో ఫెయిర్‌ఫాక్స్‌కు 40 శాతం వాటా ఉన్నది. దీంతో దాన్ని ఐడీబీఐలో విలీనం చేయడమో లేక సీఎస్బీ నుంచి వైదొలుగడమో జరుగవచ్చు.
- కనీసం మూడేైండ్లెనా ఐడీబీఐ బ్యాంక్ పేరును యథాతథంగానే కొనసాగించాల్సి ఉంటుందన్నది ప్రభుత్వం మాట.
- రెండేండ్లలో బ్యాంక్‌లో ఎల్ఐసీ వాటా కూడా 19 శాతం నుంచి 15 శాతానికి తగ్గనున్నది.
- వచ్చే ఏడాది మార్చిలోగా ఐడీబీఐ బ్యాంక్ బోర్డు నుంచి కేంద్ర ప్రభుత్వం బయటకు రానున్నది.
ఈసారి లక్ష కోట్ల పైనే..
ఎనిమిదేండ్ల తర్వాత ఈ ఆర్థిక సంవత్సరం (2026-27) ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణలకు సంబంధించి బడ్జెట్లో పెట్టుకున్న మోదీ సర్కార్ లక్ష్యం నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐడీబీఐలో వాటా విక్రయంతో ఖజానాకు దాదాపు రూ.53,000 కోట్లు రానుండటమే కారణం. చివరిసారిగా 2018-19లో కేంద్ర ప్రభుత్వం లక్ష్యాన్ని సాధించింది. మళ్లీ ఇప్పటిదాకా సాధ్యం కాలేదు. కాగా, ఈ ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ లక్ష్యం రూ.80,000 కోట్లుగా ఉన్నది. ఇప్పటిదాకా ఎల్ఐసీ, కోల్ ఇండియా సహా 9 ప్రభుత్వ రంగ సంస్థల్లో చిన్నచిన్న వాటాల అమ్మకం, ఇండియన్ మెడిసిన్స్ ఫార్మాస్యూటికల్స్ కార్పొరేషన్ లిమిటెడ్ వ్యూహాత్మక విక్రయం, ఎస్‌యూయూటీఐ నుంచి రెమిటెన్స్‌ల ద్వారా రూ.55,757 కోట్లను సమీకరించారు. ఇప్పుడు ఐడీబీఐ డీల్‌తో ఇది లక్ష కోట్ల రూపాయలను దాటిపోనున్నది.

Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

