Layoffs | 15 శాతం ఉద్యోగులపై ఎంప్లాయర్ రేటింగ్ వెబ్సైట్ గ్లాస్‌డోర్ వేటు
ఆర్ధిక మందగమనం, మాంద్యం భయాలు వెంటాడుతుండటంతో అమెజాన్, ట్విట్టర్, మెటా, గూగుల్ వంటి పలు టెక్ దిగ్గజాలు మాస్ లేఆఫ్స్‌కు (Layoffs) తెగబడగా తాజాగా ఈ జాబితాలోకి ఎంప్లాయర్ రేటింగ్ వెబ్సైట్ గ్లాస్‌డోర్ చేరింది.
న్యూఢిల్లీ : ఆర్ధిక మందగమనం, మాంద్యం భయాలు వెంటాడుతుండటంతో అమెజాన్, ట్విట్టర్, మెటా, గూగుల్ వంటి పలు టెక్ దిగ్గజాలు మాస్ లేఆఫ్స్‌కు (Layoffs) తెగబడగా తాజాగా ఈ జాబితాలోకి ఎంప్లాయర్ రేటింగ్ వెబ్సైట్ గ్లాస్‌డోర్ చేరింది. స్ధూల ఆర్ధిక పరిస్ధితుల్లో మార్పుల కారణంగా 15 శాతం మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు గ్లాస్‌డోర్ సీఈఓ క్రిస్టియన్ సదర్లాండ్ వాంగ్ ప్రకటించారు.
ఉద్యోగులకు పంపిన ఈ మెయిల్లో వాంగ్ ఈ వివరాలు వెల్లడించారు. కంపెనీలో ఇవి రెండో దశ లేఆఫ్స్ కావడం గమనార్హం. మార్చి 2020లో గ్లాస్‌డోర్ లేఆఫ్స్ ప్రకటించింది.కంపెనీ ఆదాయాలు పడిపోవడంతో లేఆఫ్స్ ప్రకటించక తప్పలేదని గ్లాస్‌డోర్ సీఈఓ పేర్కొన్నారు. విధిలేని పరిస్ధితుల్లో చివరి ఆప్షన్‌గా లేఆఫ్స్ అనివార్యమయ్యాయని చెప్పారు.
ఉద్యోగులను తగ్గించాల్సిన పరిస్ధితి తలెత్తడంతో భారమైన హృదయంతో కఠిన నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని వాంగ్ పేర్కొన్నారు. ఉద్యోగాలు కోల్పోయిన వారికి 16 వారాల మూలవేతనం, నాలుగు నెలల పాటు హెల్త్ కవరేజ్, స్ప్రింగ్ బోనస్‌తో కూడిన పరిహార ప్యాకేజ్ వర్తింపచేస్తామని కంపెనీ తెలిపింది. లేఆఫ్స్ బాధితులకు మరో ఉద్యోగం లభించే క్రమంలో కంపెనీ సహకరిస్తుందని కంపెనీ సీఈఓ వెల్లడించారు. లేఆఫ్స్ ప్రకటించకముందు పలు వ్యయ నియంత్రణ చర్యలను కంపెనీ చేపట్టిందని, నియామకాలను నిలిపివేసిందని చెప్పారు.
Read More :
Bajaj Pulsar 220F | మార్కెట్లోకి బజాజ్ పల్సర్ 220ఎఫ్.. ధర రూ.1.40 లక్షలు!
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

