Bajaj Pulsar 220F | మార్కెట్లోకి బజాజ్ పల్సర్ 220ఎఫ్.. ధర రూ.1.40 లక్షలు!
Bajaj Pulsar 220F | దేశీయ మార్కెట్లోకి బజాజ్ పల్సర్ 220 ఎఫ్ వచ్చేసింది. దీని ధర రూ.1.40 లక్షలుగా నిర్ణయించారు.
Bajaj Pulsar 220F | ప్రముఖ టూ వీలర్స్ తయారీ కంపెనీ బజాజ్ ఆటో.. దేశీయ మార్కెట్లోకి అప్డేటెడ్ వర్షన్ పల్సర్ 220 ఎఫ్ విడుదల చేసింది. దీనిధర రూ.1.40 లక్షలుగా నిర్ణయించారు. పాత మోడల్ పల్సర్ 220 ఎఫ్ కంటే రూ.3000 ఎక్కువ. గతంలో ఆవిష్కరించిన సెమీ-ఫైర్డ్ బైక్‌ను 2022 ఏప్రిల్‌లో ఉపసంహరించుకున్నది. కానీ ప్రజల నుంచి గిరాకీ రావడంతో కొన్ని అప్డేట్స్తో మళ్లీ దేశీయ మార్కెట్లో ఆవిష్కరించింది. ప్రస్తుతం పల్సర్ 220ఎఫ్ బైక్ మాత్రమే ఆవిష్కరిస్తున్నది. ఇప్పటికే డీలర్‌షిప్‌లకు బైక్‌ల తరలింపు ప్రారంభించింది. దేశవ్యాప్తంగా కంపెనీ ఆథరైజ్డ్ డీలర్‌షిప్‌ల వద్ద ఈ బైక్‌లు అందుబాటులో ఉన్నాయి. సొంత బజాజ్ పల్సర్ ఎఫ్250తోపాటు టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 200 4వీ బైక్‌లతో పోటీ పడనున్నది.
ఓల్డ్ మోడల్ బైక్‌గా కనిపిస్తున్నా బజాజ్ పల్సర్ 220 ఎఫ్ హ్యాండిల్ బార్స్‌పై క్లిప్, స్ప్లిట్ సీట్, రేర్‌లో టూ పీస్ గ్రాబ్ రైల్ ఫీచర్లు ఉన్నాయి. 220సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్, ఫ్యుయల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ తదితర ఫీచర్లు ఉన్నాయి. ఈ ఇంజిన్ 20బీహెచ్పీ విద్యుత్ 18.5 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. 5-స్పీడ్ గేర్ బాక్స్‌తో ఇంజిన్ ట్యూన్ చేశారు. కొత్త బజాజ్ పల్సర్ 220ఎఫ్ బైక్‌ను నూతన బీఎస్-6 2.0 ప్రమాణాల్లో భాగంగా ఆర్డీఈ నిబంధనలకు అనుగుణంగా డిజైన్ చేశారు. ఇది ఈ-20 పెట్రోల్‌తో నడుస్తుంది.
సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ విత్ అనలాగ్ డయల్స్ ఫర్ టచో మీటర్, ఫ్యుయల్ లెవల్ ఇండికేటర్, స్పీడో మీటర్, డిజిటల్ స్క్రీన్ తదితర ఫీచర్లు ఉన్నాయి. టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, డ్యుయల్ గ్యాస్ చార్జ్డ్ షాక్ అబ్సార్బర్లు, ఫ్రంట్ అండ్ రేర్ డిస్క్ బ్రేక్‌లు, సింగిల్ చానెల్ ఏబీఎస్, 17-అంగుళాల అల్లాయ్ వీల్స్ తదితర ఫీచర్లతో వస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

