Elon Musk | ఎలన్ మస్క్ షాకింగ్ నిర్ణయం.. భారీగా పడిపోయిన వ్యక్తిగత సంపద..!
Elon Musk | వడ్డీరేట్లు పెరిగితే టెస్లా కార్ల ధరలు తగ్గిస్తానన్న ఎలన్ మస్క్‌కు ఇన్వెస్టర్లు గట్టి షాక్ ఇచ్చారు. ఒక్కరోజే రూ.1.64 లక్షల కోట్ల పై చిలుకు వ్యక్తిగత సంపద కోల్పోయారు.
Elon Musk | అమెరికా ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లాతోపాటు స్పేస్ ఎక్స్, ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్‌కు గట్టిషాక్ తగిలింది. టెస్లా ఎలక్ట్రిక్ కార్ల ధరలు తగ్గిస్తామని ఎలన్ మస్క్ చేసిన ప్రకటనతో ఇన్వెస్టర్లలో సెంటిమెంట్ బలహీన పడింది. గురువారం నాస్డాక్-100లో టెస్లా షేర్లు 9.7 శాతం నష్టపోయి 262.90 డాలర్ల వద్దకు చేరుకున్నది. గత ఏప్రిల్ 20 తర్వాత టెస్లా షేర్ భారీగా పతనం కావడం ఇదే మొదటి సారి. దీంతో ఎలన్ మస్క్ వ్యక్తిగత సంపద 20.3 బిలియన్ డాలర్లు ఆవిరైపోయింది. మన కరెన్సీలో రూ.1.64 లక్షల కోట్ల పైమాటే. ప్రస్తుతం ఎలన్ మస్క్ వ్యక్తిగత సంపద 234.4 బిలియన్ డాలర్లు. ఇప్పటికీ ఆయన ప్రపంచ కుబేరుడిగానే కొనసాగుతున్నారు.
నాస్డాక్-100లో షేర్ల పతనం ఎలన్‌మస్క్‌కు మాత్రమే పరిమితం కాలేదు. గ్లోబల్ టెక్ దిగ్గజ సంస్థల సీఈఓలు, అధినేతలు కూడా తమ వ్యక్తిగత సంపద భారీగా నష్టపోయారు. అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, ఒరాకిల్ కార్పొరేషన్‌కు చెందిన ల్యారీ ఎల్లిసన్, మైక్రోసాఫ్ట్ మాజీ సీఈఓ స్టీవ్ బాల్మెర్, మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్, గూగుల్ పేరెంట్ సంస్థ అల్ఫాబెట్ ఇంక్ కో-ఫౌండర్లు ల్యారీ పేజ్, స్టెర్జెయ్ కలిపి 20.8 బిలియన్ డాలర్ల వ్యక్తిగత సంపద కోల్పోయారు. గురువారం నాస్డాక్-100లో ఐటీ ఇండెక్స్ 2.3 శాతం పతనమైంది. ఎలన్‌మస్క్‌తో దాదాపు సమానంగా మిగతా బిలియనీర్లు వ్యక్తిగత సంపద కోల్పోయారన్నమాట.
ఇప్పటికైతే ప్రపంచ కుబేరుడి హోదాలోనే ఎలన్ మస్క్ కొనసాగుతున్నా.. రెండో స్థానంలో ఉన్న ఎల్వీఎంహెచ్ సీఈఓ బెర్నార్డ్ అర్నాల్డ్ వ్యక్తిగత సంపద కంటే కొంచెం మాత్రమే ఎక్కువ. బెర్నార్డ్ అర్నాల్డ్ కంటే ఎలన్ మస్క్ వ్యక్తిగత సంపద 33 బిలియన్ డాలర్లు మాత్రమే ఎక్కువ. జూన్ నెలలో పారిస్‌లో ఎల్వీఎంహెచ్ వాటా పతనం కావడంతో ప్రపంచంలోనే అతిపెద్ద కుబేరుడి స్థానంలో ఉన్న బెర్నార్డ్ అర్నాల్ట్‌ను దాటేసి, ఎలన్ మస్క్ అత్యంత కుబేరుడి హోదా సంపాదించారు.
జూన్ త్రైమాసికం ఆర్థిక ఫలితాల్లో టెస్లా నాలుగేండ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఇప్పటికే తగ్గుతున్న లాభాలను నిలువరించేందుకు ఎలన్ మస్క్ చర్యలు చేపట్టారు. ఇక ముందు కూడా అమెరికా ఫెడ్ రిజర్వు వడ్డీరేట్లు పెంచితే కార్ల ధరలు తగ్గించక తప్పదన్నారు ఎలన్ మస్క్.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

