Elon Musk | భారత సంస్కృతి, సంప్రదాయాలే కాదు.. వంటకాలూ ఎంతో ప్రత్యేకం. ప్రపంచ ప్రముఖులు సైతం భారతీయ వంటకాలకు ఫిదా అవుతుంటారు. కొందరు దేశాధినేతలు, టాప్ కంపెనీల సీఈవోలు, బ్రిటన్ రాజు చార్లెస్ 111 సహా హాలీవుడ్ ప్రముఖులు సైతం పలు సందర్భాల్లో భారతీయ రుచుల (Indian Food)కు ఫిదా అయ్యారు. భారతీయ రుచులు అంటే తమకు ఎంతో ఇష్టమని చెప్పారు. ఆ జాబితాలోకి తాజాగా టెస్లా (Tesla) అధినేత, ట్విట్టర్ సీఈవో (Twitter CEO) ఎలాన్ మస్క్ (Elon Musk) వచ్చి చేరారు.
డేనిఎల్ (Daniel) అనే ఓ ట్విట్టర్ యూజర్ భారతీయ వంటకాల గురించి ఓ పెస్టు పెట్టారు. అందులో నోరూరించే బటర్ చికెన్, నాన్ రోటీ, అన్నం ఉన్న ఫొటోలను షేర్ చేస్తూ భారతీయ వంటకాలను తానెంతో ఇష్టపడతానని పేర్కొన్నాడు. ఈ ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై మస్క్ కూడా స్పందించాడు. ‘నిజమే’ అన్న ఒక్క పదంతో ఇండియన్ ఫుడ్ (Indian Food)పై తనకున్న అభిప్రాయాన్ని వెల్లడించారు.
మరోవైపు ఈ ట్వీట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘మస్క్ భారత్ వచ్చి ఇక్కడి వంటకాలను రుచి చూడండి’, ‘భారత్ పర్యటనకు సిద్ధం కండి’, ‘28 రాష్ట్రాలు.. 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో వివిధ రకాల వంటకాలను ఎప్పుడు టేస్ట్ చేస్తారు..?’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
I love basic bitch Indian food it’s so insanely good pic.twitter.com/FJmjgL2H3e
— Daniel (@growing_daniel) May 16, 2023
Also Read..
Priyanka Chopra | ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ఇంతవరకూ చూడలేదు.. ప్రియాంక షాకింగ్ కామెంట్స్
Anushka Sharma | బైక్‌పై లొకేషన్‌కు బిగ్‌బీ, అనుష్కశర్మ.. హెల్మెట్ ఎక్కడ అంటూ నెటిజన్ల ప్రశ్న
East Godavari | వధువు డ్యాన్స్ చేయలేదని.. పందిట్లో కొట్టుకున్న బంధువులు.. ఐదుగురికి గాయాలు