Supercomputer | 2025 నాటికి అందుబాటులోకి ఎక్స్ఏఐ సూపర్‌కంప్యూటర్ : ఎలన్ మస్క్ కసరత్తు
Supercomputer : టెస్లా, స్పేస్ఎక్స్, ఎక్స్ వంటి కంపెనీల వెనకున్న మాస్టర్ మైండ్ ఎలన్ మస్క్ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ ఎక్స్ఏఐను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లడంపై కసరత్తు వేగవంతం చేశారు.
Supercomputer : టెస్లా, స్పేస్ఎక్స్, ఎక్స్ వంటి కంపెనీల వెనకున్న మాస్టర్ మైండ్ ఎలన్ మస్క్ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ ఎక్స్ఏఐను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లడంపై కసరత్తు వేగవంతం చేశారు. తన ఏఐ చాట్‌బాట్ గ్రోక్ కోసం 2025 నాటికి సూపర్‌కంప్యూటర్‌ను క్రియేట్ చేయాలని మస్క్ యోచిస్తున్నారు.
సూపర్‌కంప్యూటర్ ఆవిష్కరణ దిశగా కార్యాచరణతో ముందుకెళతామని ఎలన్ మస్ఖ్ ఇటీవల ఇన్వెస్టర్లతో వెల్లడించినట్టు ది ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ తెలిపింది. ఈ అడ్వాన్స్డ్ మెషీన్ 2025 నాటికి పనిచేసేలా సూపర్‌కంప్యూటర్ తయారీ ప్రణాళికలతో మస్క్ ముందుకెళుతున్నారు.
భవిష్యత్ ఏఐ మోడల్స్ కోసం జీపీయూ వాడకాన్ని విస్తృతం చేసేందుకు మస్క్ ప్రణాళికలు రూపొందించారు. ఈ సూపర్‌కంప్యూటర్ ఒరాకిల్ భాగస్వామ్యంతో ఎన్విదియా హెచ్100 జీపీయూలను వినియోగిస్తుంది. ఈ భారీ సూపర్‌కంప్యూటర్‌ను డెవలప్ చేయడంలో సాయపడేందుకు ఒరాకిల్‌తో భాగస్వామ్యం కోసం ప్రయత్నిస్తున్నామని మస్క్ సంకేతాలు పంపారు.
అయితే దీనిపై ఎక్స్ఏఐ, ఒరాకిల్ తక్షణమే స్పందించలేదు. డేటా సెంటర్లలో ఏఐ సంబంధిత టాస్క్ కోసం ఈ చిప్స్‌కు భారీ డిమాండ్ నెలకొనడంతో తన సూపర్ కంప్యూటర్ ప్రాజెక్ట్ కోసం ఈ టెక్నాలజీకి మస్క్ మొగ్గుచూపుతున్నాడని చెబుతున్నారు.
Read More :
Cancer | యువతపై క్యాన్సర్ పడగ.. దేశంలో పెరుగుతున్న కేసులు
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

