Elon Musk on Twitter | ఎలన్‌మస్క్ షాకింగ్ కామెంట్స్.. ఇప్పటికీ నెగెటివ్‌గా ట్విట్టర్ క్యాష్ ఫ్లో..!
Elon Musk on Twitter | సోషల్ మీడియా సైట్ ట్విట్టర్ లోటు బడ్జెట్’లో ఉందని సంస్థ అధినేత ఎలన్ మస్క్ షాకింగ్ కామెంట్స్ చేశారు. యాడ్స్ సగం తగ్గితే.. రుణ భారం ఎక్కువగా ఉందన్నారు.
Elon Musk on Twitter | మైక్రోబ్లాగింగ్ సైట్, సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సంస్థ నగదు కొరత సమస్యనెదుర్కొంటుందని ఆదివారం అంగీకరించారు. ఇప్పటికీ ట్విట్టర్’కు క్యాష్ ఫ్లో నెగెటివ్‌గా ఉందన్నారు. ట్విట్టర్‌కు భారీగా రుణాలు ఉండటంతోపాటు వాణిజ్య ప్రకటనల ద్వారా వచ్చే రెవెన్యూ సగానికి పడిపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఎలన్ మస్క్ సమాధానం ఇస్తూ.. ‘ట్విట్టర్ ముందుగా నిల్వలు ఏర్పాటు చేసుకునే స్థాయికి చేరుకోవాలి` అని అన్నారు. అయినా ప్రతి రోజూ వెరిఫైడ్ అకౌంట్స్ ట్వీట్లు 50 శాతం పెరుగుతున్నాయని విడిగా ప్రకటించారు. తిరిగి అడ్వర్టైజ్మెంట్లు రాబట్టగలిగితే క్యాష్ ఫ్లో పాజిటివ్‌గా మారుతుందన్నారు.
యాడ్స్ ఆదాయంలో 50 శాతం తగ్గడంతో ట్విట్టర్ ఇంకా నగదు లోటులోనే ఉందని ఎలన్ మస్క్ చెప్పారు. దీనికి తోడు రుణ భారం చాలా ఎక్కువగా ఉందన్నారు. లోటు నిల్వల స్థాయి నుంచి ట్విట్టర్ మిగులు నిధుల స్థాయికి చేరుకోవడం చాలా ముఖ్యం అని వ్యాఖ్యానించారు. ఈ ఏడాది ట్విట్టర్‌కు 450 కోట్ల డాలర్ల ఆదాయం వస్తుందని అంచనా వేసినా.. తర్వాత 300 కోట్లకు తగ్గించారు. 2021లో 510 కోట్ల డాలర్లతో పోలిస్తే చాలా తక్కువ.
ట్విట్టర్‌ను ఎలన్ మస్క్ టేకోవర్ చేసినప్పటి నుంచి దాన్ని ఒక ప్రయోగ శాలగా మార్చివేశారు. ఆయన చేపట్టిన వ్యయ నియంత్రణ, పొదుపు చర్యలేవీ ఫలితాలిచ్చిన దాఖలాలు కనిపించడం లేదు. భారీగా ఉద్యోగులకు ఉద్వాసన పలికారు.. అయినా మస్క్ ఆశించిన మేరకు ట్విట్టర్ ఆదాయం పెంచుకోలేకపోయింది.
ఇదిలా ఉంటే ట్విట్టర్ యూజర్లకు రోజుకొక రూల్ తీసుకొస్తూ వారి సహనాన్ని పరీక్షిస్తున్నారు. బ్లూ టిక్, సబ్స్క్రిప్షన్ నిబంధనలు తెచ్చి ఎక్కువ మంది యూజర్లు వెరిఫైడ్ అకౌంట్లు తీసుకునేలా చేశాడు. యూజర్లు తమ ట్వీట్లు చూసేందుకు పరిమితి విధించడంతో నెటిజన్లు అసంతృప్తికి గురవుతున్నారు. దీనికి తోడు ట్విట్టర్‌కు పోటీగా మెటా.. తన ఇన్స్టాగ్రామ్ అనుబంధ సంస్థగా ‘థ్రెడ్స్’ అనే యాప్ తీసుకొచ్చింది. మార్కెట్లోకి తెచ్చిన కొన్ని రోజుల్లోనే 10 కోట్ల మంది యూజర్లు ‘థ్రెడ్స్’ ఖాతాలో చేరారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

