Festival Offers | హైదరాబాద్, అక్టోబర్ 7: ప్రముఖ స్మార్ట్ఫోన్ల రిటైల్ విక్రయ సంస్థ లాట్ మొబైల్స్ 12వ వార్షికోత్సవంతోపాటు దసరా, దీపావళి పండుగలను దృష్టిలో పెట్టుకొని వినూత్న ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. స్మార్ట్ టీవీలు, స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్, ఎలక్ట్రానిక్ పరికరాలను కొనుగోలు చేసినవారికి కనీ వినీ ఎరుగని విధంగా 9 ఆఫర్లను ప్రకటించినట్లు కంపెనీ డైరెక్టర్ ఎం అఖిల్ తెలిపారు.
ఈ ఆఫర్లులో రూ.9,999 వరకు కొనుగోలు చేసే ప్రతిదానిపై ఖచ్చితమైన బహుమతితోపాటు స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్టాప్, ఏసీలపై 40 శాతం వరకు తగ్గింపు ఆఫర్తోపాటు 10 శాతం తక్షణ నగదు వాపస్, ఎలాంటి ముందస్తు చెల్లింపులు జరపకుండానే నో కాస్ట్ ఈఎంఐ స్కీం, ఎస్బీఐ క్రెడిట్ కార్డుపై 5 శాతం వరకు తక్షణ తగ్గింపు, బ్యాండెడ్ యాక్సెస్సిరీస్పై 80 శాతం వరకు తగ్గింపు, ఓప్పో ఫోన్లపై లక్కీ డ్రా ద్వారా రూ.10 లక్షల నగదు, ఎంఐ, రియల్మీ మొబైళ్లపై లక్కీ డ్రాలో కార్లు, బైక్స్, మరెన్నో బహుమతులు గెలుచుకునే అవకాశం కల్పించింది.