రెడ్డీస్ ప్రాఫిట్ డౌన్… క్యూ1లో 69 శాతం తగ్గి రూ.434 కోట్లకు పరిమితం
రాష్ర్టానికి చెందిన ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను సంస్థ రూ.434.8 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. కిందటేడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.1,409.6 కోట్ల లాభంతో పోలిస్తే 69.2 శాతం క్షీణత కనబరిచింది.
హైదరాబాద్, జూలై 22 : రాష్ర్టానికి చెందిన ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను సంస్థ రూ.434.8 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. కిందటేడాది ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.1,409.6 కోట్ల లాభంతో పోలిస్తే 69.2 శాతం క్షీణత కనబరిచింది. సెమాగ్లుటైడ్ పదార్థాలకు సంబంధించిన అంశాల ప్రభావంతోపాటు ఉత్తర అమెరికాలో జనరిక్ మందుల ఆదాయం తగ్గడం వంటి ప్రతికూల అంశాలు లాభాలపై ప్రభావం చూపాయని పేర్కొంది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.8,545.2 కోట్ల నుంచి రూ.8,070.5 కోట్లకు పడిపోయినట్టు బీఎస్ఈకి సమాచారం అందించింది.
అలాగే నిర్వహణ ఖర్చులు రూ.3,115. 2 కోట్ల నుంచి రూ.3,375.6 కోట్లకు ఎగబాకాయి. ఈ సందర్భంగా డాక్టర్ రెడ్డీస్ కో-చైర్మన్, ఎండీ జీవీ ప్రసాద్ మాట్లాడుతూ..గత త్రైమాసికంలో పనితీరు ఆశించిన స్థాయిలో లేదని, సెమాగ్లుటైడ్ పదార్థాలకు సంబంధించిన అంశాలతోపాటు ఉత్తర అమెరికాలో విక్రయాలు మందకొడిగా ఉండటం ఇందుకు కారణమన్నారు. గత త్రైమాసికంలో ఇన్వెంటరీ నష్టాలు రూ.239.7 కోట్లు రావడం కూడా లాభాలపై గండిపడిందన్నారు. అంతర్జాతీయంగా జనరిక్ ఔషధాలను విక్రయించడంతో సంస్థకు రూ.7,199.3 కోట్ల ఆదాయం మాత్రమే సమకూరింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

