Reliance Jio | న్యూఢిల్లీ, జనవరి 11: దేశీయ టెలికం రంగ దిగ్గజం రిలయన్స్ జియో మూడు సరికొత్త రకాల్లో అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్లను పరిచయం చేసింది. ఇందులో భాగంగానే యూఏఈ, యూఎస్ఏ, వార్షిక ప్యాకేజీలను ప్రకటించింది. వీటిలోనే ఉచిత ఇన్-ఫ్లైట్ ప్రయోజనాలతోనూ ప్రత్యేకంగా ప్లాన్లను తీసుకొచ్చింది. అలాగే వన్డే ఇన్-ఫ్లైట్ డాటా, వాయిస్ ప్లాన్లనూ ప్రవేశపెట్టింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
21 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ ధర రూ.2,998గా, 14 రోజులది రూ.1,598 గా, 7 రోజులది రూ.898గా ఉన్నాయి. రూ.2,998 ప్లాన్లో 250 నిమిషాల చొప్పున ఇన్కమింగ్, ఔట్గోయింగ్ వాయిస్ కాల్స్ ఉంటాయి. 7జీబీ డాటా, 100 ఎస్ఎంఎస్లు వస్తాయి. రూ.1,598 ప్లాన్లో 150 నిమిషాల చొప్పున ఇన్కమింగ్, ఔట్గోయింగ్ వాయిస్ కాల్స్, 3జీబీ డాటా, 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి. రూ.898 ప్లాన్లో 100 నిమిషాల చొప్పున ఇన్కమింగ్, ఔట్గోయింగ్ కాల్స్, 1జీబీ డాటా, 100 ఎస్ఎంఎస్లుంటాయి.
వార్షిక అంతర్జాతీయ రోమింగ్ ప్లాన్ ధర రూ.2,799. ఇందులో 2జీబీ డాటా లభిస్తుంది. 100 నిమిషాల వాయిస్ కాల్స్ (ఇన్కమింగ్, ఔట్గోయింగ్) ఉంటాయి. 100 ఎస్ఎంఎస్లుంటాయి. 51 దేశాల్లో చెల్లుబాటు అవుతుంది.
30 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ ధర రూ.3,455గా ఉన్నది. అలాగే 21 రోజులది రూ.2,555, 10 రోజులది రూ.1,555గా ఉన్నాయి. రూ.3,455 ప్లాన్లో 250 నిమిషాల చొప్పున వాయిస్ కాల్స్, 25జీబీ డాటా, 100 ఎస్ఎంఎస్లుంటాయి. రూ.2,555 ప్లాన్లో 250 నిమిషాల వాయిస్ కాల్స్, 15జీబీ డాటా, 100 ఎస్ఎంఎస్లుంటాయి. రూ.1,555 ప్లాన్లో 150 నిమిషాల వాయిస్ కాల్స్, 7జీబీ డాటా, 100 ఎస్ఎంఎస్లున్నాయి.