ఒడిదొడుకుల్లోనే పయనం!
దేశీయ స్టాక్ మార్కెట్లు గత వారం మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, గ్లోబల్ మార్కెట్లో పెరుగుతున్న ముడి చమురు ధరలు.. భారతీయ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే అంతకుముందు వారం ముగింపుతో చూస్తే గత వారం బీఎస్ఈ ప్రధాన సూచీ సెన్సెక్స్ 1,070.39 పాయింట్లు కోల్పోయి 81,11 8.60 వద్ద నిలిచింది.
- మార్కెట్ పల్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు గత వారం మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, గ్లోబల్ మార్కెట్లో పెరుగుతున్న ముడి చమురు ధరలు.. భారతీయ స్టాక్ మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే అంతకుముందు వారం ముగింపుతో చూస్తే గత వారం బీఎస్ఈ ప్రధాన సూచీ సెన్సెక్స్ 1,070.39 పాయింట్లు కోల్పోయి 81,11 8.60 వద్ద నిలిచింది. ఇక ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 284.45 పాయింట్లు పడిపోయి 24,71 8.60 దగ్గర ముగిసింది. దీంతో ఈ వారం కూడా పశ్చిమాసియా దేశాల్లోని పరిస్థితుల ప్రభావం స్థానిక ఈక్విటీలపై స్పష్టంగా ఉండవచ్చన్న అంచనాలైతే ఉన్నాయి. ఆయిల్-గ్యాస్ తదితర రంగాల షేర్ల కదలికలు కీలకమని చెప్పుకోవచ్చు.
అయితే రెపోరేటు 50 బేసిస్ పాయింట్లు తగ్గిన నేపథ్యంలో రియల్టీ, ఆటో, బ్యాంకింగ్ రంగాల షేర్లకు గిరాకీ ఉండవచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇదిలావుంటే ఎప్పట్లాగే డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ, గ్లోబల్ స్టాక్ మార్కెట్ల తీరుతెన్నులు, విదేశీ సంస్థాగత మదుపరుల (ఎఫ్ఐఐ) పెట్టుబడులు, దేశీయ మార్కెట్లను నిర్దేశించనున్నాయి. ఇక అమ్మకాల ఒత్తిడి కనిపిస్తే నిఫ్టీకి 24,500 పాయింట్ల స్థాయి కీలకమైనదనుకోవచ్చు. దీనికి దిగువన ముగిస్తే 24,300 పాయింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చని అత్యధిక నిపుణుల మాట. కానీ సూచీలు పరుగందుకుంటే ఈ వారం నిఫ్టీ 25,000-25,200 స్థాయికి వెళ్లవచ్చని కూడా చెప్తున్నారు.
గమనిక..: స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి. వివిధ దేశ, విదేశీ పరిణామాలు ట్రేడింగ్‌ను ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి. కాబట్టి ఇక్కడ ఒడిదొడుకులు చాలా సహజం. పెట్టుబడులు పెట్టే ముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం, ఆయా సాధనాల డాక్యుమెంట్లను క్షుణ్ణం గా చదువుకోవడం ఉత్తమం. అలాగే పైన పేర్కొన్న సూచనలు విశ్లేషకుల అభిప్రాయం మాత్రమే. దీనికి మా పత్రిక ఎటువంటి బాధ్యత వహించదు. ఎవరి పెట్టుబడులకు వారిదే పూర్తి బాధ్యత. అవగాహన కోసమే ఈ మార్కెట్ పల్స్.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

