ఎగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ రివ్వున ఎగిశాయి. బ్యాంకింగ్, వాహన, చమురు రంగ షేర్లకు లభించిన మద్దతుతోపాటు దేశ ఆర్థిక రంగం పరుగులు పెడుతున్నట్లు వచ్చిన గణాంకాలు మార్కెట్లకు మరింత కిక్కునిచ్చాయి.
ముంబై, మార్చి 27: దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ రివ్వున ఎగిశాయి. బ్యాంకింగ్, వాహన, చమురు రంగ షేర్లకు లభించిన మద్దతుతోపాటు దేశ ఆర్థిక రంగం పరుగులు పెడుతున్నట్లు వచ్చిన గణాంకాలు మార్కెట్లకు మరింత కిక్కునిచ్చాయి. ఇంట్రాడేలో 700 పాయింట్ల వరకు లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ 73 వేల పైకి చేరుకున్నది. చివర్లో 526 పాయింట్లు లాభపడి 72,996.31 వద్ద ముగిసింది. 30 షేర్లలో 18 సూచీలు లాభపడగా, 12 నష్టాల్లో ముగిశాయి. మరో సూచీ నిఫ్టీ 118.95 పాయింట్లు అందుకొని 22,123.65 వద్ద స్థిరపడింది. ఎఫ్ఎంసీజీ, ఐటీ రంగ షేర్లు పడిపోయినప్పటికీ ఆటో, బ్యాంకింగ్, ఎనర్జీ రంగ షేర్లు మెరిసాయి.
రిలయన్స్ 20 లక్షల కోట్లకు పైగా
రిలయన్స్ ఇండస్ట్రీస్ మళ్లీ రూ.20 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌ను అధిగమించింది. ఇంట్రాడేలో 4 శాతం లాభపడిన కంపెనీ షేరు.. చివరకు 3.60 శాతం వృద్ధితో రూ.2,987.85 వద్ద ముగిసింది. దీంతో కంపెనీ మార్కెట్ విలువ మరో రూ.70,039 కోట్లు పెరిగి రూ.20,21,486.59 కోట్లకు చేరుకున్నది. ఇదిలా ఉంటే ఆటో దిగ్గజం మారుతి సుజుకీ రూ.4 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌ను అధిగమించింది.
- రిలయన్స్ 20,21,486.59
- టీసీఎస్ 13,88,441.09
- హెచ్డీఎఫ్సీ 10,94,486.92
- ఐసీఐసీఐ 7,61,126.88
- భారతీ ఎయిర్టెల్ 6,92,041.28
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | రజనీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్ ..తెలంగాణలో సాధారణ టికెట్ ధరలకే ‘జైలర్ 2’..
Mamitha Baiju | ‘జై హనుమాన్’లో మమితా బైజు.. రిషబ్ శెట్టి, రానా సరసన కీలక పాత్రలో కనిపించనుందా?
Donald Trump: రష్యా నుంచి డీజిల్ కొంటామన్న ట్రంప్.. పుతిన్‌కు గిఫ్ట్ ఇచ్చారన్న జెలెన్స్కీ
Ramayana | కైకేయిగా లారా దత్తా, మంథరగా షీబా.. ‘రామాయణం’ నుంచి ఫస్ట్ లుక్స్ విడుదల
Drishyam 3 | ‘దృశ్యం 3’ బాక్సాఫీస్ సునామీ.. 8 రోజుల్లోనే రూ. 400 కోట్లు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

