Us Israel War | ఎగుమతులు ఢమాల్..పశ్చిమాసియా సంక్షోభం ప్రభావం.. ఈ నెలా అంతంతే
దేశీయ ఎగుమతులు పడిపోయాయి. గతంతో పోల్చితే ఈ ఏడాది మార్చి నెలలో 7.44 శాతం క్షీణించాయి. గడిచిన 5 నెలల్లో ఇదే గరిష్ఠం. గత నెల వస్తూత్పత్తి ఎగుమతులు 38.92 బిలియన్ డాలర్లకే పరిమితమైనట్టు బుధవారం విడుదలైన కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాల్లో తేలింది మరి.
- మార్చిలో 7.44 శాతం డౌన్ l 38.92 బిలియన్ డాలర్లకే పరిమితం
- పశ్చిమాసియా సంక్షోభం ప్రభావం.. ఈ నెలా అంతంతే
- కేంద్ర వాణిజ్య కార్యదర్శి రాజేశ్ అగర్వాల్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: దేశీయ ఎగుమతులు పడిపోయాయి. గతంతో పోల్చితే ఈ ఏడాది మార్చి నెలలో 7.44 శాతం క్షీణించాయి. గడిచిన 5 నెలల్లో ఇదే గరిష్ఠం. గత నెల వస్తూత్పత్తి ఎగుమతులు 38.92 బిలియన్ డాలర్లకే పరిమితమైనట్టు బుధవారం విడుదలైన కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాల్లో తేలింది మరి. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం..
భారతీయ ఎగుమతుల్ని ప్రభావితం చేసినట్టు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర వాణిజ్య కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ తెలిపారు. అయితే దేశీయ ఎగుమతులపై ఈ ఏప్రిల్‌లోనూ యుద్ధ ప్రభావం ఉంటుందనడం గమనార్హం. ఇరాన్ తమ పరిధిలోని హొర్ముజ్ జలసంధిని మూసివేయడంతో సరుకు రవాణాకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి యుద్ధంతో పశ్చిమాసియా అట్టుడికిపోతున్న సంగతి విదితమే.
గల్ఫ్ దేశాలకు బంద్..
భారత్ నుంచి గల్ఫ్ దేశాలకు వివిధ రకాల వస్తూత్పత్తుల ఎగుమతులు జరుగుతాయి. అయితే యుద్ధంతో యూఏఈ, ఖతార్, కువైట్, ఒమన్, బహ్రెయిన్, సౌదీ అరేబియా దేశాలకు జరిగే ఆయా ఎగుమతులకు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలోనే మార్చిలో మిడిల్ ఈస్ట్ రీజియన్‌కు భారతీయ ఎగుమతులు ఏకంగా 57.95 శాతం క్షీణించాయి. సాధారణంగా ప్రతి నెలా 6 బిలియన్ డాలర్లుగా ఉండే ఎగుమతులు.. ఈ మార్చిలో దాదాపు 2-2.5 బిలియన్ డాలర్లుగానే ఉన్నాయని రాజేశ్ అగర్వాల్ చెప్పారు. రత్నాలు, ఆభరణాలు, ఎలక్ట్రానిక్స్, ఇంజినీరింగ్, పెట్రోలియం ఉత్పత్తులు, బియ్యం ఎగుమతులు 3.5 బిలియన్ డాలర్ల మేర దెబ్బతిన్నాయని ఆయన వెల్లడించారు.
దిగుమతులపైనా ప్రభావం
హొర్ముజ్ జలసంధిలో అవాంతరాలు.. దేశీయ దిగుమతుల్నీ ప్రభావితం చేశాయి. గత నెల మార్చిలో 6.51 శాతం క్షీణతతో 59.59 బిలియన్ డాలర్లుగానే ఉన్నాయి. నిరుడు మార్చిలో 63.75 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఈ ఏడాది తగ్గిన ముడి చమురు, బంగారం దిగుమతులే కారణం. కాగా, ఈ మార్చిలో దేశీయ ఎగుమతుల కంటే దిగుమతులే ఎక్కువగా ఉండటంతో వాణిజ్య లోటు 20.67 బిలియన్ డాలర్లుగా ఉన్నది. ఇదిలావుంటే గత నెలలో గల్ఫ్ దేశాల నుంచి భారత్‌కు వచ్చిన దిగుమతులూ 51.64 శాతం పడిపోయినట్టు రాజేశ్ అగర్వాల్ వివరించారు.
20 నుంచి వాణిజ్య చర్చలు
భారత్-అమెరికా మధ్య వాణిజ్య చర్చలు ఈ నెల 20 నుంచి మొదలవుతాయని కేంద్ర వాణిజ్య కార్యదర్శి రాజేశ్ అగర్వాల్ తెలిపారు. ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందంపై వాషింగ్టన్లో మూడు రోజులపాటు ఈ చర్చలు జరుగుతాయన్నారు. భారత బృందానికి దర్పన్ జైన్ నాయకత్వం వహిస్తారు. ఇదిలావుంటే భారత్-బ్రిటన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) వచ్చే నెల మే నుంచి అమల్లోకి వస్తుందని రాజేశ్ స్పష్టం చేశారు.
- గత ఆర్థిక సంవత్సరం (2025-26) దేశీయ వస్తు, సేవల ఎగుమతులు 860.09 బిలియన్ డాలర్లుగా నమోదు. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2024-25)తో పోల్చితే 4.22 శాతం వృద్ధి. నాడు 825.26 బిలియన్ డాలర్లు.
- 2025-26లో వస్తూత్పత్తుల ఎగుమతులు 0.93 శాతం పెరిగి 437.70 బిలియన్ డాలర్ల నుంచి 441.78 బిలియన్ డాలర్లకు చేరిక. ఇది ఆల్‌టైమ్ హై.
- గత ఆర్థిక సంవత్సరం దేశీయ వస్తూత్పత్తుల దిగుమతులు 7.45 శాతం ఎగిసి 774.98 బిలియన్ డాలర్లకు పెరుగుదల. అంతకుముందు ఆర్థిక సంవత్సరం 721.20 డాలర్లే.
- వస్తూత్పత్తుల వాణిజ్య లోటు 333.20 బిలియన్ డాలర్లుగా నమోదైంది. దేశంలోకి ముడి చమురు, బంగారం, వెండి దిగుమతులు పెరుగడమే వాణిజ్య లోటును ఎగదోసింది.
- ఈ మార్చిలో 35.91 శాతం దిగి 12.18 బిలియన్ డాలర్లుగా ముడి చమురు దిగుమతులు. 2025-26 మొత్తంగా 6.37 శాతం క్షీణించి 174 బిలియన్ డాలర్లుగా నమోదు.
- గత నెల బంగారం దిగుమతులు 31.63 శాతం పతనమై 3.06 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అయితే గత ఆర్థిక సంవత్సరం 24 శాతం ఎగబాకి 71.97 బిలియన్ డాలర్లకు చేరిక.
- ఈ మార్చిలో సేవల ఎగుమతులు 35.20 బిలియన్ డాలర్లు. గత ఆర్థిక సంవత్సరం మొత్తంగా 418.31 బిలియన్ డాలర్లు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

