టాప్ 1000 కంపెనీలకు డివిడెండు విధానం తప్పనిసరి: సెబి

ముంబై, మే 11: కార్పొరేట్ గవర్నెన్స్, డిస్క్లోజర్లను పటిష్టపర్చేదిశగా మార్కెట్ నియంత్రణా సంస్థ సెబి కొత్త నిబంధనలను నోటీఫై చేసింది. ఈ నిబంధనల్లో భాగంగా టాప్ 1000 లిస్టెడ్ కంపెనీలు డివిడెండు పంపిణీ విధానాన్ని తప్పనిసరిగా రూపొందించుకోవాల్సివుంటుంది. మార్కె ట్ విలువ ఆధారంగా టాప్ 500 కంపెనీలకు తప్పనిసరి డివిడెండు పంపిణీ విధానం ప్రస్తుతం అమలులో వుండగా, ఈ సంఖ్యను 1000కు పెంచుతూ తాజా నిబంధనల్ని సెబి సవరించింది. ఇతర లిస్టెడ్ కంపెనీలు వాటి డివిడెండు పంపిణీ విధానాన్ని స్వచ్ఛందంగా వాటి వెబ్సైట్లలో ప్రకటించుకోవొచ్చు. అలాగే రిస్క్ మేనేజ్మెంట్ కమిటీల ఏర్పాటును టాప్ 1000 కంపెనీలకు సెబి తప్పనిసరి చేసింది. ఈ కమిటీల్లో ఒక ఇండిపెండెంట్ డైరెక్టర్‌తో సహా కనీసం ముగ్గురు సభ్యులు వుండాలి. రిస్క్ మేనేజ్మెంట్ పాలసీని రూపొందించడం, దాని అమలును పర్యవేక్షించడం, సమీక్షించడం ఈ కమిటీ పని. మార్చి 31నాటి మార్కెట్ క్యాప్ ఆధారంగా టాప్ కంపెనీను నిర్ధారిస్తారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

