Tata Play- Disney | టాటా సన్స్ అనుబంధ సంస్థ టాటా ప్లేలో తన వాటాను పెంచుకున్నది. మరోవైపు ఇందులో భాగస్వామ్య సంస్థగా ఉన్న మరో ఎంటర్ టైన్ మెంట్ సంస్థ డిస్నీ.. టాటా ప్లేలో పూర్తి వాటాలను టాటా సన్స్‌కు అప్పగించేందుకు రెండు సంస్థల మధ్య ఒప్పందం కుదిరినట్లు వార్తలు వచ్చాయి. మరోవైపు, అమెరికా కేంద్రంగా పని చేస్తున్న వాల్ట్ డిస్నీ.. భారత్‌లో తన కార్యకలాపాలను రిలయన్స్ ఇండస్ట్రీస్ సారధ్యంలోని జియోలో విలీనం చేస్తున్నది. ఆ వ్యాపారాలపై కేంద్రీకరించేందుకే టాటా ప్లేలోని తన పూర్తి వాటాలను డిస్నీ వదిలేసుకున్నది.
టాటా ప్లేలో టాటా సన్స్ తన వాటాను గత నెలలో 70 శాతానికి పెంచేసుకున్నది. సింగపూర్ ప్రభుత్వ పెట్టుబడుల సంస్థ టెమాసెక్ నుంచి 100 మిలియన్ డాలర్లకు 10 శాతం వాటా సొంతం చేసుకుంది. దీని తర్వాత టాటా ప్లే, టాటా గ్రూప్ మధ్య 70:30 జాయింట్ వెంచర్ గా మారిపోయింది. తాజాగా చేసుకున్న ఒప్పందం ప్రకారం టాటా ప్లేలోని మిగతా 30 శాతం వాటాలనూ టాటా సన్స్ కు అప్పగించినట్లు తెలుస్తోంది. దీంతో టాటా ప్లే పూర్తిగా టాటా సన్స్ అనుబంధ సంస్థగా మారిపోనున్నది.