JioAirFiber | జియో ఎయిర్ ఫైబర్ ఇన్‌స్టాలేషన్‌లో రాయితీ
ఎయిర్‌ఫైబర్ వినియోగదారులకు శుభవార్తను అందించింది జియో. వచ్చే నెల 15 వరకు ఇన్స్టాలేషన్ చార్జీలు రూ.1,000 రాయితీ ఇస్తున్నట్టు గురువారం ప్రకటించింది. అలాగే ఎంట్రీ-లెవల్ ప్లాన్లపై 30 శాతం వరకు రాయితీ ఇస్తున్నది.
JioAirFiber | న్యూఢిల్లీ, జూలై 25: ఎయిర్‌ఫైబర్ వినియోగదారులకు శుభవార్తను అందించింది జియో. వచ్చే నెల 15 వరకు ఇన్స్టాలేషన్ చార్జీలు రూ.1,000 రాయితీ ఇస్తున్నట్టు గురువారం ప్రకటించింది. అలాగే ఎంట్రీ-లెవల్ ప్లాన్లపై 30 శాతం వరకు రాయితీ ఇస్తున్నది. జూన్‌తో ముగిసిన మూడు నెలలకాలంలో దేశవ్యాప్తంగా 11 లక్షల మంది నూతన ఎయిర్‌ఫైబర్ కనెక్షన్లు మాత్రమే చేరారు. ఇతర పోటీ సంస్థల నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకోవాలనే ఉద్దేశంతో జియో ఈ నిర్ణయం తీసుకున్నది.
ఆల్‌టైం కనిష్ఠానికి రూపాయి
న్యూఢిల్లీ: చారిత్రక కనిష్ఠ స్థాయికి రూపాయి పడిపోయింది. ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌కు డిమాండ్ పెరగడంతో రూపాయి విలువ 7 పైసలు తరిగిపోయి ఆల్‌టైం కనిష్ఠ స్థాయి 83.78కి జారుకున్నది. విదేశీ నిధులు తరలించుకుపోవడం, డాలర్‌కు డిమాండ్ పెరగడంతో మారకం విలువ నెల కనిష్ఠానికి జారింది. 83.72 వద్ద ప్రారంభమైన డాలర్-రుపీ రేటు ఇంట్రాడేలో 83.66 గరిష్ఠ స్థాయికి చేరుకున్నది.
ఐపీవోకి స్టాండర్డ్ గ్లాస్
హైదరాబాద్, జూలై 25: హైదరాబాద్‌కు చెందిన స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్ స్టాక్ మార్కెట్లోకి లిస్ట్ కాబోతున్నది. ఇందుకు సంబంధించి స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్‌ను సమర్పించింది. ఐపీవో ద్వారా గరిష్ఠంగా రూ.600 కోట్ల వరకు నిధులు సమీకరించాలనుకుంటున్నది. దీంట్లో ఫ్రెష్ ఇష్యూ ద్వారా రూ.250 కోట్లు, ఆఫర్ ఫర్ సేల్ రూట్లో మరో రూ.350 కోట్లను 1.84 కోట్ల షేర్లను జారీ చేయడం ద్వారా సేకరించాలనుకుంటున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

