Dell Layoffs | ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల కోత కొనసాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం కారణంగా కార్పొరేట్ సంస్థలు వేలల్లో ఉద్యోగుల్ని తీసేస్తున్నాయి. మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్, మెటా, ట్విట్టర్, ఇంటెల్, ఓఎల్ఎక్స్ తదితర టాంప్ కంపెనీలు ఇప్పటికే చాలా మందిని ఇంటికి పంపించేశాయి. ఈ జాబితాలోకి తాజాగా టెక్ దిగ్గజం డెల్ వచ్చి చేరింది.
కంపెనీలో వేల మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. ఏకంగా 6,600 మందిని తొలగించేందుకు కంపెనీ చర్యలు చేపట్టినట్లు ఆ సంస్థకు చెందిన ఓ అధికారి తెలిపారు. దూసుకొస్తున్న ఆర్థిక మాంద్యం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో ఈ తగ్గింపులు 5 శాతం వరకు ఉన్నట్లు వెల్లడించారు.