Dell Layoffs | డెల్లో కొనసాగుతున్న లేఆఫ్స్ : 6000 మంది ఉద్యోగులపై వేటు
Dell Layoffs | : టెక్ దిగ్గజాలు లేఆఫ్స్‌ను కొనసాగిస్తుండటం ఉద్యోగుల్లో గుబులు రేపుతోంది. ఓవైపు ఉద్యోగుల సంఖ్యను కుదిస్తూనే హైరింగ్‌ను కూడా పరిమితంగా చేపడుతున్నట్టు డెల్ వెల్లడించింది.
Dell Layoffs : టెక్ దిగ్గజాలు లేఆఫ్స్‌ను కొనసాగిస్తుండటం ఉద్యోగుల్లో గుబులు రేపుతోంది. ఓవైపు ఉద్యోగుల సంఖ్యను కుదిస్తూనే హైరింగ్‌ను కూడా పరిమితంగా చేపడుతున్నట్టు డెల్ వెల్లడించింది. వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా డెల్ 6000 మంది ఉద్యోగులపై వేటు వేసింది. గత రెండేండ్లుగా తన కంప్యూటర్లను ఎక్కువ మంది ప్రజలు కొనుగోలు చేయకపోవడంతో ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్నట్టు డెల్ తెలిపింది.
విక్రయాలు పడిపోవడంతో ఆర్ధిక ఇబ్బందులు చుట్టుముట్టిన క్రమంలో ఉద్యోగులపై వేటు వేయక తప్పలేదని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఇక పీసీలతో పాటు క్లైంట్స్ సొల్యూషన్స్ గ్రూప్ నుంచి ఏడాది మొత్తానికి రాబడి పెరుగుతుందని డెల్ అంచనా వేస్తోంది. అయితే ఏడాది చివరి మూడు నెలల్లో ఈ రంగం నుంచి రాబడి 12 శాతం పడిపోయింది.
రాబోయే రోజుల్లో కొంత గడ్డు పరిస్ధితులు ఎదురైనా తమ ప్రోడక్ట్స్‌కు మెరుగైన డిమాండ్ ఉంటుందని డెల్ అంచనా వేస్తోంది. కాగా ఉద్యోగులకు డెల్ ఇటీవల చేసిన హెచ్చరికలకు టెకీల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. ఇప్పటికీ ఇంటి నుంచి పనిచేస్తున్న ఉద్యోగులకు పదోన్నతుల విషయంలో పరిగణనలోకి తీసుకోబోమని డెల్ స్పష్టం చేసింది. ఉద్యోగులు తిరిగి కార్యాలయాల నుంచి పని చేయడం ప్రారంభించాలని డెల్ కోరింది.
Read More :
KTR | ఇష్టమొచ్చినట్లు నోరు పారేసుకోవద్దు.. కిషన్ రెడ్డిని హెచ్చరించిన కేటీఆర్
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

