హైదరాబాద్, మార్చి 31 : వ్యాపారపరమైన అంశాల్లో భాగస్వామ్యంపై భారత్ డైనమిక్స్ లిమిటెడ్(బీడీఎల్)..యునైటెడ్ అరబ్ ఎనిమిరేట్స్కు చెందిన తవాజున్ ఎకనమిక్ కౌన్సిల్ల మధ్య గురువారం ఒప్పందం కుదిరింది. రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ, మరమ్మత్తులు, సాంకేతిక అభివృద్ధి, రక్షణ రంగ ఉత్పత్తుల ఎగుమతి తదితర అంశాల్లో కలిసి పనిచేయడంపై ఇరు సంస్థలు ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ మేరకు గురువారం సంస్థ కార్యాలయంలో బీడీఎల్ సీఎండీ సిద్ధార్థ మిశ్రా సమక్షంలో బీడీఎల్ టెక్నికల్ డైరెక్టర్ ఎన్పీ దివాకర్, తవజున్ ఎకనమిక్ కౌన్సిల్ చీఫ్ ఆఫీసర్ జయేద్ సయీద్ జలీల్ హదీర్ అల్మేరఖిలు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.