బాలీవుడ్ నటి దీపిక పదుకొణేను ప్రచారకర్తగా నియమించుకున్నది ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్. అంతర్జాతీయ ఐకాన్ దీపిక పదుకొణే బ్రాండ్ అంబాసిడర్‌గా
నియమితులవడం చాలా సంతోషంగా ఉన్నదని,
ఆమె చార్మ్‌తో సంస్థ మరింత పురోభివృద్ధి సాధిస్తుందని హ్యుందాయ్ మోటర్ సీవోవో తరుణ్ గ్యాంగ్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. దేశీయ ఆటోమొబైల్ రంగంలో ఆవిష్కరణలకు పెద్దపీట వేస్తున్న హ్యుందాయ్తో చేతులు కలపడం చాలా సంతోషంగా ఉన్నదని దీపిక పదుకొణే వ్యాఖ్యానించారు.