Market Capitalisation | బేర్మన్న దలాల్ స్ట్రీట్.. రూ.6 లక్షల కోట్ల ఎం-క్యాప్ హాంఫట్!
Market Capitalisation | మాంద్యం భయంతోపాటు జీడీపీ 7% అన్న అంచనాలు, రూపాయి బలహీనతలతో ఇన్వెస్టర్లు రూ.6 లక్షల ఎం-క్యాప్ కోల్పోయారు.
Market Capitalisation | ఆర్థిక మాంద్యం భయాలు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు ఏడు శాతమేనన్న ఫిచ్ అంచనాలు.. డాలర్‌పై రూపాయి మారకం విలువ బలహీనం, నష్టాల్లో గ్లోబల్ మార్కెట్లు.. తదితర కారణాలతో స్టాక్ మార్కెట్లలో దేశీయ ఇన్వెస్టర్లు రూ.6 లక్షల కోట్లకు పైగా మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయారు. శుక్రవారం బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.285.9 లక్షల కోట్ల నుంచి రూ.279.8 లక్షల కోట్లకు పడిపోయింది. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 1,093.22 పాయింట్ల పతనంతో 59వేల పాయింట్ల దిగువన స్థిర పడింది. ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 17,550 మార్క్ దిగువకు పతనమైంది.
గ్లోబల్ మార్కెట్లలో బలహీనతలు దేశీయ స్టాక్ మార్కెట్ల పతనానికి కారణం. నిక్కీ, కోస్పీ, హాంగ్ సెంగ్ వంటి స్టాక్స్ భారీగా పతనం అయ్యాయి. గురువారం రాత్రి యూఎస్ స్టాక్స్ భారీగా పతనం అయ్యాయి. వచ్చేవారం యూఎస్ ఫెడ్ రిజర్వు కీలక వడ్డీరేట్లు పెంచితే, ఆర్థిక మాంద్యం ఏర్పడుతుందని ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) హెచ్చరించాయి.
ఎన్ఎస్ఈలో రిలయన్స్ ఇండస్ట్రీస్ 2.48 శాతం, ఇన్ఫోసిస్ 3.89, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ & హెచ్‌డీఎఫ్‌సీతోపాటు టీసీఎస్ 3.08, ఐసీఐసీఐ బ్యాంకు 0.93 శాతం నష్టపోయాయి. ఐటీ, బ్యాంకింగ్, ఫైనాన్సియల్ స్క్రిప్ట్‌లు భారీ నష్టలతో ముగిశాయి. ఇండస్ఇండ్ బ్యాంక్ 2.63, సన్‌ఫార్మా మాత్రమే లాభాలు గడించాయి. మరోవైపు ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్‌పై రూపాయి మారకం విలువ 11 పైసలు నష్టపోయి 79.79 వద్ద నిలిచింది. గత సెషన్‌తో పోలిస్తే 11 పైసలు నష్టపోయింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

