D-Mart | డీ-మార్ట్ తొలి త్రైమాసికం ఫలితాల్లో 17.5 శాతం గ్రోత్.. కొత్తగా ఆరు స్టోర్ల ప్రారంభం..!
D-Mart | డీ-మార్ట్ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న రిటైల్ చైన్ ఎవెన్యూ సూపర్ మార్ట్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) తొలి త్రైమాసికం ఆర్థిక ఫలితాల్లో 17.45 శాతం వృద్ధి సాధించింది.
D-Mart | డీ-మార్ట్ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న రిటైల్ చైన్ ఎవెన్యూ సూపర్ మార్ట్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) తొలి త్రైమాసికం ఆర్థిక ఫలితాల్లో 17.45 శాతం వృద్ధి సాధించింది. జనరల్ మర్చండైజ్, అపారెల్స్ సేల్స్ పుంజుకోవడంతో ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో డీ-మార్ట్ రూ.773.68 కోట్ల నికర లాభం గడించినట్లు ఎక్స్చేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో రూ.658.71 కోట్ల నికర లాభం సంపాదించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో డీ-మార్ట్ ఆపరేషన్ల ద్వారా 18.57 శాతం ఆదాయం పెంచుకున్నది. 2023-24 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.11,865.44 కోట్ల ఆదాయం సంపాదించిన డీ-మార్ట్.. ఈ ఏడాది రూ.14,069.14 కోట్లు సముపార్జించింది. అలాగే గతేడాది జూన్ త్రైమాసికంతో పోలిస్తే ఈ ఏడాది తొలి త్రైమాసికంలో డీ-మార్ట్ మొత్తం ఖర్చులు 18.62 శాతం పెంచుకుని రూ.13,056.61 కోట్లకు చేరాయి. జూన్ త్రైమాసికంలో ఎవెన్యూ సూపర్‌మార్ట్ మొత్తం ఆదాయం 18.54 శాతం పుంజుకుని రూ.14,110.74 కోట్లకు చేరింది.
జనరల్ మర్చండైజ్, అపారెల్ సేల్స్ మెరుగు పడటంతో స్థూల లాభాలు గడించినట్లు ఎవెన్యూ సూపర్ మార్ట్స్ సీఈఓ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నెవిల్లె నొరోన్హా చెప్పారు. జూన్ 30 తేదీ నాటికి కొత్తగా ఆరు స్టోర్లను ప్రారంభించింది డీ-మార్ట్. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం సంస్థ స్టోర్ల సంఖ్య 371కి చేరుకున్నది. మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో డీ-మార్ట్ రిటైల్ బిజినెస్ నిర్వహిస్తోంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

