Crude Oil on CAD | కరంట్ ఖాతా లోటు (సీఏడీ-క్యాడ్) మూడేండ్ల గరిష్ఠ స్థాయికి పెరుగొచ్చని అంచనా వెలువడుతున్నది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 0.9 శాతం పెరిగి 23.91 బిలియన్ డాలర్లకు చేరుకున్న (Current account deficit – CAD )క్యాడ్.. గత ఆర్థిక సంవత్సరం 1.8 శాతం దూసుకెళ్లి 43.81 బిలియన్ డాలర్లకు చేరవచ్చునని విశ్లేషకులు భావిస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో క్యాడ్.. 17.3 బిలియన్ డాలర్లు అని ఇండియా రేటింగ్స్ అంచనా వేసింది. ఇది చివరి త్రైమాసికం వృద్ధిరేటులో 1.96 శాతం.
2020-21 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం వృద్ధిరేటులో 1.03 శాతం కాగా, గత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికం జీడీపీ (23.02 బిలియన్ డాలర్లు)లో క్యాడ్ 2.74 శాతం అని ఇండియా రేటింగ్స్ పేర్కొంది. సెప్టెంబర్-డిసెంబర్ మధ్య క్యాడ్.. 13 త్రైమాసికాల గరిష్టానికి చేరుకున్నది. మూడో త్రైమాసికంతో పోలిస్తే మార్చి త్రైమాసికంలో క్యాడ్ భారీగా తగ్గింది.
2020-21లో కరోనా మహమ్మారి ప్రభావంతో వాణిజ్య ఎగుమతులు మైనస్ 7.5 శాతం కాగా, గతేడాది రికార్డు స్థాయిలో పుంజుకుని 42.4 శాతానికి చేరుకున్నాయి. కానీ ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కారణంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి వల్ల క్రూడాయిల్ ధరలు పెరిగిపోయాయని ఇండియా రేటింగ్స్ అంచనా వేసింది.