Best Mid-Size SUV Cars | బెస్ట్ ఇన్ మిడ్‌సైజ్ ఎస్యూవీ హ్యుండాయ్ క్రెటా.. ఆ మూడు మోడల్స్ పూర్
Best Mid-Size SUV Cars | కార్లలో ఎస్‌యూవీలు, మిడ్ సైజ్ ఎస్‌యూవీల పట్ల కస్టమర్లలో క్రేజ్ ఉంది. వాటిల్లో హ్యుండాయ్ క్రెటా మొదటి స్థానంలో ఉండగా, మారుతి గ్రాండ్ విటారా తర్వాతీ స్థానంలో నిలిచింది.
Best Mid-Size SUV Cars | కరోనా మహమ్మారి తర్వాత ప్రతి ఒక్కరూ పర్సనల్ మొబిలిటీ వైపు మొగ్గుతున్నారు. అందునా స్పేసియస్‌గా స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్యూవీ)లు, మిడ్‌సైజ్ ఎస్యూవీ మోడల్స్ మీద మోజు పెంచుకుంటున్నారు. మిడ్ సైజ్ ఎస్‌యూవీల్లో హ్యుండాయ్ క్రెటా ఆధిపత్యం ప్రదర్శిస్తున్నది. గత నెలలో ఇంప్రెస్సివ్ వాల్యూమ్స్ అమ్ముడు కావడంతో మొదటి వరుసలో నిలిచింది. మారుతి సుజుకి గ్రాండ్ విటారా సేల్స్ బాగానే జరిగాయి. కియా సెల్టోస్ సేల్స్ తగ్గడంతో త్వరలో కియా మోటార్స్ మార్కెట్లోకి వచ్చే సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు కస్టమర్లు.
ఇక స్కోడా కుషాక్, ఫోక్స్ వ్యాగన్ టైగూర్, ఎంజీ మోటార్స్ సేల్స్ పేలవంగా నమోదయ్యాయి. కుషాక్, టైగూర్ కార్లు కనీసం 2000 కార్లు కూడా అమ్ముడు కాలేదు. ఇక ఎంజీ మోటార్స్ ఆస్టర్ మాత్రం 1000 కార్లలోపే అమ్ముడయ్యాయి.
హ్యుండాయ్ క్రెటా గత నెలలో అద్భుతమైన సేల్స్ నమోదు చేసుకున్నది. గత నెలలో 14,449 క్రెటా కార్లు అమ్ముడు పోగా, మారుతి సుజుకి గ్రాండ్ విటారా 8,877 యూనిట్లకు పరిమితమైంది. కియా సెల్టోస్ 4065 కార్లు అమ్ముడు కాగా, తాజా అప్ డేటెడ్ మోడల్ ఫేస్ లిఫ్ట్ వచ్చేనెల నాలుగో తేదీన మార్కెట్లోకి రానున్నది.
మారుతి సుజుకి గ్రాండ్ విటారా మాదిరిగా టయోటా అర్బన్ క్రూయిజ్ హైరైడర్ అంతగా విజయవంతం కాలేకపోయిందని చెబుతున్నారు. గ్రాండ్ విటారా -అర్బన్ క్రూయిజ్ హైరైడర్ ఒకే టెక్నాలజీతో రూపుదిద్దుకున్న కార్లు కావడం గమనార్హం. టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ 3090 కార్లు విక్రయించింది. స్కోడా కుషక్ 1685, ఫోక్స్ వ్యాగన్ 1484 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇక ఎంజీ మోటార్స్ అస్టర్ కేవలం 592 యూనిట్లకే పరిమితమైంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

