CREDAI | ఇండ్ల రుణాల వడ్డీపై ఆదాయం పన్ను మినహాయించాలి.. కేంద్రానికి క్రెడాయ్ అప్పీల్..!
CREDAI | రోజురోజుకు అపార్డబుల్ హౌసింగ్‌కు గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో ఇండ్ల రుణాలపై వడ్డీ చెల్లింపులకు పన్ను పూర్తిగా మాఫీ చేయాలని కోరింది.
CREDAI | అపార్డబుల్ హౌసింగ్ అనే పదానికి నిర్వచనం సవరించాలని కేంద్రాన్ని ప్రముఖ రియాల్టీ డెవలపర్ల సంస్థ – కాన్ఫిడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) కోరింది. రోజురోజుకు అపార్డబుల్ హౌసింగ్‌కు గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో ఇండ్ల రుణాలపై వడ్డీ చెల్లింపులకు పన్ను పూర్తిగా మాఫీ చేయాలని కోరింది. ప్రస్తుతం ఆదాయం పన్ను చట్టం కింద ఇంటి రుణాలు తీసుకున్నవారు రుణాలపై రూ.2 లక్షల వడ్డీ చెల్లింపుపై ఆదాయం పన్ను మినహాయింపు లభిస్తుంది. కానీ మొత్తం వడ్డీ చెల్లింపునకు ఆదాయం పన్ను రాయితీ కల్పించాలని క్రెడాయ్ ప్రెసిడెంట్ బొమన్ ఇరానీ అభ్యర్థించారు.
క్రెడాయ్ 25వ వార్షికోత్సవం సందర్భంగా రూ.45 లక్షల్లోపు అపార్డబుల్ హౌసింగ్ అన్న నిర్వచనాన్ని రూ.75-80 లక్షలకు సవరించాలని కోరారు. అలాగే రూ.75-80 లక్షల్లోపు విలువ గల నిర్మాణంలో ఉన్న ఇండ్ల నిర్మాణాలపై జీఎస్టీ ఒకశాతానికి పరిమితం చేయాలని అభ్యర్థించారు. ఇప్పుడు రూ.45 లక్షల్లోపు విలువ గల ఇండ్ల నిర్మాణంపై జీఎస్టీ ఒక్క శాతం ఉంది. రూ.45 లక్షలపై చిలుకు విలువ గల నిర్మాణంలోని ఇండ్లపై ఐదుశాతం జీఎస్టీ వర్తిస్తుంది. దీనిపై డెవలపర్లు ఇన్ పుట్ టాక్స్ క్రెడిట్ క్లయిమ్ చేసుకునేందుకు నిబంధనలు అనుమతించడం లేదు.
2017లో అపార్డబుల్ హౌసింగ్ అంటే రూ.45 లక్షల్లోపు విలువ గల ఇల్లు అని నిర్ణయించారు. కానీ 2017 నుంచి పెరిగిన వార్షిక ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకున్నా, ఈ పరిమితిని రూ.75-80 లక్షలకు పెంచాలని బొమన్ ఇరానీ కోరారు. జీఎస్టీ తగ్గించడంతోపాటు అపార్డబుల్ హౌసింగ్ నిర్వచనాన్ని సవరిస్తే ఇండ్ల కొనుగోలుదారులు లబ్ధి పొందుతారని పేర్కొన్నారు. ఇక ఇండ్ల నిర్మాణ అనుమతులకు 12 నుంచి 18 నెలల వరకూ టైం పడుతుందని, వేగంగా అనుమతులు ఇచ్చేలా చూడాలని అభ్యర్థించారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

