Covid Vaccine: మారుమూల ప్రాంతాలకు డ్రోన్లతో పంపిణీ.. ఎందుకంటే!
Covid Vaccine: మారుమూల ప్రాంతాలకు డ్రోన్లతో పంపిణీ.. ఎందుకంటే!| తాలకు డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్లు పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పిం....

న్యూఢిల్లీ: ఈ ఏడాది చివరికల్లా దేశ పౌరులందరికీ వ్యాక్సిన్ వేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యాలను నిర్దేశించుకున్నది. అయితే, అత్యంత మారుమూల ప్రాంతాల్లో, అందుబాటులో లేని ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్లు పంపిణీ చేయాలని సంకల్పించింది.
ఇందుకోసం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తరఫున కేంద్ర ప్రభుత్వ సంస్థ హెచ్ఎల్ఎల్ అనుబంధ హెచ్ఎల్ఎల్ ఇన్ఫ్రాటెక్ టెండ్లర్లను ఆహ్వానిస్తున్నది. డ్రోన్లు నిర్వహించే సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోనున్నది.
ఈ నెల 22న హెచ్ఎల్ఎల్ ఇన్ఫ్రా టెక్ టెండర్లను తెరవనున్నది. మారుమూల ప్రాంతాలకు వ్యాక్సిన్లతోపాటు ఇతర అత్యవసర ఔషధాలను డ్రోన్ల ద్వారా సరఫరా చేయనున్నది. ఈ డ్రోన్లు కనీసం 35 కిలో మీటర్ల దూరం వెళ్లి, వ్యాక్సిన్లు పంపిణీ చేసి తిరిగి రాగల సామర్థ్యం కలిగి ఉండాలి.

డ్రోన్ కనీసం నాలుగు కిలోల సరుకు రవాణా చేయగల శక్తి ఉండాలి. ప్యారాచూట్ సాయంతో సరుకు పంపిణీని అనుమతించరు. కేంద్ర పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ ప్రమాణాలకు అనుగుణంగా డ్రోన్ బరువు ఉండాలి.
సంబంధిత డ్రోన్ల కంపెనీలతో తొలుత 90 రోజుల గడువు గల ఒప్పందాన్ని కుదుర్చుకుంటారు. వ్యాక్సిన్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఐసీఎంఆర్ ప్రయోగాత్మకంగా డ్రోన్లతో డెలివరీ చేపట్టింది.
ఐఐటీ-కాన్పూర్ సాయంతో రూపుదిద్దుకున్న డ్రోన్లతో పైలట్ ప్రాతిపదికన ఐసీఎంఆర్ వ్యాక్సిన్ల పంపిణీ నిర్వహించింది. తద్వారా డ్రోన్లతో వ్యాక్సిన్ల పంపిణీకి ప్రమాణాలను ఖరారు చేసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

