సిటీబ్యూరో, జనవరి 21: వినూత్న ఆలోచనలతో విభిన్న రంగాలకు చెందిన సమస్యలకు పరిష్కారం చూపే స్టార్టప్‌లకు తమ ప్రోత్సాహం ఉంటుందని కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులు పేర్కొన్నారు. శుక్రవారం టీ హబ్ వేదికగా పలు కార్పొరేట్ సంస్థలతో ప్రత్యేక సదస్సును నిర్వహించారు. ఈ సందర్బంగా టీ హబ్ ఎంపిక చేసిన స్టార్టప్‌లలో 80కి పైగా స్టార్టప్‌లు తమ ఆలోచనలతో రూపొదించిన పరిష్కార మార్గాలను ప్రదర్శించాయి. సుమారు 48 కార్పొరేట్ సంస్థలు ఈ సదస్సుల్లో భాగస్వామ్యమయ్యాయని టీ హబ్ నిర్వాహకులు తెలిపారు. స్టార్టప్‌లకు కార్పొరేట్ కంపెనీల నుంచి పూర్తి స్థాయిలో ఆర్థికంగా, సాంకేతికంగా, మార్కెటింగ్ పరంగా సహకారం అందించే ఉద్దేశ్యంతో నిర్వహించిన ఈ సదస్సు మంచి ఫలితాలను ఇస్తున్నదని ఆ వర్గాలు వెల్లడించాయి.