హైదరాబాద్, అక్టోబర్ 26: కోరమాండల్ నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ఈ ఏడాది రెండో త్రైమాసికానికిగాను రూ.7,031 కోట్ల ఆదాయంపై రూ.762 కోట్ల లాభాన్ని గడించింది.
క్రితం ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ.10,140 కోట్ల ఆదాయంతో పోలిస్తే భారీగా తగ్గగా, నికరలాభంలో పెరుగుదల కనిపించింది.